Videos Leak: ఈ తప్పులు చేస్తే మీ సీక్రెట్స్ అన్నీ లీక్ అవుతాయ్.. బీ కేర్‌ఫుల్..

ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రైవేట్ వీడియోలు లీక్ అవుతున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మీ మొబైల్‌లో ప్రతిదానికి సెక్యూరిటీ లాక్ ఏర్పాటు చేసుకోవాలి. తెలియని వ్యక్తులకు మొబైల్ ఇవ్వొద్దు. ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు ఉంటే డిలీట్ చేయడం ఉత్తమం.

New Update
Videos Leak: ఈ తప్పులు చేస్తే మీ సీక్రెట్స్ అన్నీ లీక్ అవుతాయ్.. బీ కేర్‌ఫుల్..

Tech News: ప్రస్తుత కాలంలో చాలా మంది పర్సనల్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అవడం చూస్తూనే ఉన్నాం. ఈ కంటెంట్‌ను ప్రజలు కూడా విస్తృతంగా షేర్ చేస్తున్నారు కూడా. అయితే, లీకైన ఎంఎంఎస్‌(MMS)ను కేవలం వీడియో మాదిరిగా చూస్తే సరిపోదు. వాస్తవానికి చాలా రకాల ఎంఎంఎస్‌లు ఉన్నాయని, ఇందులో వీడియోలు, షార్ట్ GIF, ఆడియో క్లిప్, పిక్చర్, స్లయిడ్ షో మొదలైన వాటిని కూడా MMS అంటారని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, ఈ ఎంఎంఎస్ వీడియోలు లీక్ అవడం వల్ల చాలా మంది ఆత్మహత్యకు పాల్పడిన వారు కూడా ఉన్నారు. మరి మీ మొబైల్ నుంచి పర్సనల్ వీడియోలు, ఫోటోలు ఎంఎంఎస్‌లు లీక్ కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇవాళ మనం తెలుసుకుందాం...

MMS ఎలా లీక్ అవుతుంది?

⇒ MMS లీక్ కావడానికి ప్రధాన కారణాలలో ఒకటి ప్రతీకారం. వాస్తవానికి.. ప్రేమికులు, కపుల్స్ ప్రైవేట్‌గా కలిసినప్పుడు.. తమ వీడియోలను, ఫోటోలను తీసుకుంటుంటారు. అయితే, చాలా కాలం అన్యోన్యంగా, సంతోషంగా ఉన్న జంట మధ్య తగాదాలు ఏర్పడితే.. విడిపోతే.. భాగస్వామి ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తారు.

⇒ అందుకే.. మీరు మీ భాగస్వామిని కలుస్తున్నప్పుడు గదిలో ఏదైనా రహస్య కెమెరా ఏర్పాటు చేశారేమో ఒకసారి చూసుకోవాలి. ఈ విషయంలో ఏమాత్రం పొరపాటు చేయొద్దు. మీరిద్దరూ ప్రైవేట్‌గా ఉన్నప్పుడు ఏదైనా పర్సనల్ సన్నివేశాన్ని రికార్డ్ చేస్తున్నట్లయితే.. దానిని వెంటనే డిలీట్ చేసేయాలి.

⇒ MMS లీకేజీకి కారణం ఏంటంటే.. మీరు మీ మొబైల్ ఫోన్‌లో సెక్యూరిటీ పాస్‌వర్డ్స్ పెట్టకుండా వేరే వ్యక్తికి అందజేయడం వల్లే ఇది జరుగుతుంది. అవతలి వ్యక్తి మీ వ్యక్తిగత సమాచారాన్ని తప్పుగా ఉపయోగించుకోవచ్చు. లేదా భవిష్యత్తులో బెదిరింపుల కోసం కోసం స్టోరేజ్ చేసిపెట్టుకోవచ్చు.

⇒ అలాగే, మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో రిపేర్ కోసం ఇస్తున్నట్లయితే.. మీ వ్యక్తిగత వీడియోలు, ఫోటోలను తొలగించాలి. లేదంటే.. రిపేర్ చేయించే క్షణంలో మీరు అక్కడే ఉండండి. తద్వారా ఎవరూ మీ డేటాను దుర్వినియోగం చేయరు. అలాగే మీ ఫోన్‌కు అన్ని రకాల లాక్స్ ఉండేలా చూసుకోవాలి.

⇒ ఎంఎంఎస్‌లు హ్యాకింగ్‌ ద్వారా కూడా లీక్‌ అవుతాయి. హ్యాకర్లు డబ్బు కోసం మాత్రమే డేటాను దొంగిలించినప్పటికీ.. కొన్నిసార్లు వారు MMS లేదా ఫోన్‌లో వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసిన తరువాత తర్వాత కూడా వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటారు. దీన్ని నివారించడానికి.. మీ ఫోన్‌లో థర్డ్ పార్టీ యాప్‌లను ఎప్పుడూ ఉంచవద్దు. తెలియని లింక్‌పై అస్సలు క్లిక్ చేయవద్దు.

⇒ ప్రస్తుతం, మార్కెట్లో AI గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఏఐ విషయంలో సానుకూల అంశాల కంటే.. తప్పుడు వినియోగమే ఎక్కువగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌ఫేక్స్ సహాయంతో.. మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు, ఫోటోలు, ఆడియోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారు. అందుకే ప్రజలు తమ వ్యక్తిగత వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయవద్దని ప్రభుత్వాలు, పోలీసులు చాలాసార్లు హెచ్చరిస్తున్నారు.

లీక్ కాకుండా ఏం చేయాలి?

MMS లీక్ అవ్వకుండా ఉండేందుకు ఉత్తమమైన, సులభమైన మార్గం మీ వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచడమే. మీ పర్సనల్ విషయాలను ఫోన్‌లో రికార్డ్ చేయొద్దు. ఒకవేళ ఏదైనా క్యాప్చర్ చేస్తే.. మీరు తప్ప మరెవరూ దానిని యాక్సెస్ చేయలేని విధంగా సురక్షితంగా ఉంచాలి.

వీలైతే కొంత కాలం తరువాత మీ వ్యక్తిగత అంశాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను డిలీట్ చేయండి. పొరపాటున కూడా ఇలాంటి వాటిని ఎవరితోనూ పంచుకోవద్దు. ముఖ్యంగా గ్రూప్ చాటింగ్‌లో వీటన్నింటికీ దూరంగా ఉండాలి. ఇక సోషల్ మీడియా ద్వారా మీ భాగస్వామితో ప్రైవేట్ ఫోటోలను షేర్ చేయొద్దు. ఎందుకంటే.. ప్రస్తుత కాలంలో కొందరు కీచకులు వాటిని కూడా దుర్వినియోగం చేస్తున్నారు.

Also Read:

కేసీఆరే మంచోడు.. ఎంపీ అరవింద్ షాకింగ్ కామెంట్స్..

అప్పుడేం చేశారు.. నారా లోకేష్ పై మంత్రి విడదల రజని సంచలన కామెంట్స్..

Advertisment
Advertisment
తాజా కథనాలు