Motorola Edge 50: మొటరోలా నుంచి మరో బెస్ట్ స్మార్ట్ ఫోన్.. 30 నిమిషాలు నీటిలో ఉన్నా ఏం కాదట! ప్రముఖ మొబైల్ కంపెనీ మోటోరోలా మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ‘మోటోరొలా ఎడ్జ్ 50’ అనే పేరుతో ఆగస్టు 1న కొత్త సీరీస్ ను రిలీజ్ చేయబోతుంది. ఈ స్మార్ట్ ఫోన్స్ మోటోరొలా స్టోర్స్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ- కామర్స్ సైట్స్ లో అందుబాటులో ఉండనున్నాయి. By Archana 29 Jul 2024 in బిజినెస్ లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Motorola Edge50: ప్రముఖ మొబైల్ కంపెనీ మరో సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయబోతుంది. 'మోటోరొలా ఎడ్జ్ 50’ అనే పేరుతో కొత్త సీరీస్ అందుబాటులోకి రానుంది. ఈ లేటెస్ట్ సీరీస్ ఆగస్టు 1న ఇండియన్ మార్కెట్స్ లో లాంచ్ కాబోతుంది. ఈ స్మార్ట్ ఫోన్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్, ఇంగ్రెస్ ప్రొటెక్షన్(ఐపీ)68 తో వస్తోంది. ఐపీ68 ఫోన్ లోకి దుమ్ము , నీరు చేరకుండా కాపాడుతుంది. ఈ ఫోన్ అత్యంత వేడి వాతావరణాన్ని కూడా తట్టుకునేలా రూపొందించబడింది. డెసర్ట్ ఏరియాస్, వేడి ప్రాంతాల్లో పనిచేసే వారికి అనుకూలంగా ఉండేలా MotorolaEdge50 తయారుచేయబడింది. ఒకటిన్నర మీటరు నీటి లోతులో 30 నిమిషాలు ఉన్నా.. ఫోన్ లోకి నీరు చేరకుండా ఉంటుందని కంపెనీ చెబుతోంది. MotorolaEdge50 సీరీస్ 50 మూడు వేరియంట్లలో, మూడు కలర్ ఆప్షన్‌లలో లభించనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర 25 వేలకు పైగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. MotorolaEdge50 ని వరల్డ్ స్లిమ్మెస్ట్ ఫోన్ గా చెబుతున్నారు. #MotorolaEdge50 is made to withstand the hottest environments, whether you're exploring deserts or working in heat, trust it to stay cool & work flawlessly. Embrace extreme temperatures! 🌞🔥 Launching 1 Aug @Flipkart, https://t.co/azcEfy1Wlo & leading stores.#CraftedForTheBold pic.twitter.com/gMmXBArZUg — Motorola India (@motorolaindia) July 29, 2024 MotorolaEdge50 స్పెసిఫికేషన్స్ 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ 15 వాట్స్ వైర్‌లెస్ ఛార్జర్ 6.67 ఫోఎల్‌ఈడీ డిస్‌ప్లే 1900 నిట్స్ హెచ్‌డీఆర్ పీక్ బ్రైట్‌నెస్ సోనీ లిటియా 700సీ కెమెరా Also Read: Double Ismart: ఇస్మార్ట్ కొత్త పాట.. చూస్తూనే చలిలోనూ నరం నరం.. గరం గరం.. - Rtvlive.com #motorola-edge-50-5g-smartphone #motorola-latest-series మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి