BSNL OTT OFFERS: BSNL ఓటీటీ ప్లాన్స్.. రూ. 49 నుంచే Zee5, Disney, SonyLIV సబ్‌స్క్రిప్షన్..!

ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL వినియోగదారుల కోసం అతి తక్కువ ధరకే అనేక ఓటీటీ ప్లాన్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్ పేరు BSNL సినిమా ప్లస్. ఇందులో OTT సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ రూ. 49 నుంచి రూ. 250 వరకు అందుబాటులో ఉన్నాయి.

New Update
BSNL OTT OFFERS: BSNL ఓటీటీ ప్లాన్స్.. రూ. 49 నుంచే Zee5, Disney, SonyLIV సబ్‌స్క్రిప్షన్..!

BSNL OTT OFFERS:  ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ బాగా పెరుగుతోంది. థియేటర్స్ కంటే కూడా చాలా ఓటీటీల్లో సినిమాలు, ఇతర ఎంటర్టైన్మెంట్ చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఇక ఓటీటీ ప్రియుల కోసం పలు టెలికాం సంస్థలు రకరకాల ఓటీటీ ప్లాన్స్ ను అందిస్తున్నాయి. Jio, Airtel, Vodafone Idea తమ కస్టమర్‌లకు OTT సబ్‌స్క్రిప్షన్ ఇవ్వబడే అనేక ప్లాన్‌లను అందిస్తున్నాయి.

BSNL సినిమా ప్లస్.

అయితే ఇప్పుడు ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL కూడా అతి తక్కువ ధరకే అనేక ఓటీటీ ప్లాన్‌లను అందిస్తోంది. ఈ కంపెనీ OTT సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధర రూ. 49 నుంచి రూ. 250 వరకు ఉంటుంది. ఈ ప్లాన్ పేరు BSNL సినిమా ప్లస్.

BSNL ఓటీటీ ప్లాన్ వివరాలు

BSNL రూ. 49 ప్లాన్ - ఈ ప్లాన్‌లో, షెమరూ, హంగామా, లయన్స్‌గేట్, EPIC ఆన్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.

BSNL 119- BSNL రూ. 119 ప్లాన్‌లో, ZEE5 ప్రీమియం, SonyLIV ప్రీమియం, YuppTV , డిస్నీ + హాట్‌స్టార్ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.

BSNL 249- BSNL రూ. 249 ప్లాన్‌లో, వినియోగదారులు Zee5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, Sony LIV ప్రీమియం, YuppTV, షెమరూ, Hungama, Lionsgate, డిస్నీ హాట్ స్టార్ ప్రయోజనాలను పొందవచ్చు.

 సినిమా ప్లస్ ప్లాన్ ప్రయోజనాలు...

వినియోగదారులు తమ PC, ల్యాప్‌టాప్, మొబైల్, టాబ్లెట్, స్మార్ట్ టీవీ అన్నింటిలోనూ సినిమా ప్లస్ ప్లాన్‌లో లభించే OTT ప్రయోజనాలను పొందవచ్చు. అన్ని OTTల కోసం ఎంచుకున్న ప్లాన్ మెంబర్‌షిప్ BSNL ఫైబర్ కనెక్షన్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో యాక్టివేట్ చేయబడుతుంది. వినియోగదారు బిల్లుకు చందా రుసుము వసూలు చేయబడుతుంది.

Also Read: Mechanic Rocky: విశ్వక్‌ సరసన కోలీవుడ్ బ్యూటీ.. 'మెకానిక్‌ రాకీ' అప్డేట్ ..! - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు