ఇప్పటికే ఐర్లాండ్ పై నెగ్గి శుభారంభం చేసిన భారత్.. చిరకాల ప్రత్యర్థితో తలపడేందుకు రెడీ అవుతుంది. భారత్, పాకిస్తాన్ మధ్య ఆదివారం మ్యాచ్ జరగనుంది.ఇక టోర్నీలో అనూహ్యంగా అమెరికా చేతిలో ఓడిన పాకిస్తాన్ సొంత అభిమానుల నుంచే విమర్శలు ఎదుర్కొంటుంది. అమెరికా చేతిలో ఓడిన మీరు భారత్ ను ఏం ఓడిస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇక ఈ మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ బౌలర్లను టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భయపెడుతున్నాడు. కోహ్లీని తలుచుకుని వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.ప్రస్తుతం విరాట్ కోహ్లీ పేరు వింటే చాలు పాకిస్తాన్ కు ఎక్కడ లేని భయం. గజగజ వణికిపోతుంది. ముఖ్యంగా టి20 ప్రపంచకప్ లలో కోహ్లీ అంటే పాకిస్తాన్ కు ఎక్కడలేని వణుకు. అందుకు కారణం మెగా ఈవెంట్స్ లో పాక్ పై కోహ్లీ బ్యాటింగ్ రికార్డ్సే.
టి20 ప్రపంచకప్‌లో మరే ఆటగాడు సాధించని రీతిలో పాకిస్థాన్‌పై రికార్డు సగటును కోహ్లి కలిగి ఉన్నాడు. పొట్టి కప్‌లో చిరకాల ప్రత్యర్థిపై 308 పరుగులు చేశాడు. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై 300+ సగటు కలిగి ఉన్న ఏకైక బ్యాటర్ కోహ్లినే.టి20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై కోహ్లి నాలుగు 50+ స్కోర్లు సాధించాడు. పాక్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో 78 నాటౌట్, 36 నాటౌట్, 55 నాటౌట్, 57, 82 నాటౌట్‌తో పరుగులు చేశాడు. గత వరల్డ్ కప్‌లో మెల్‌బోర్న్ వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి అద్వితీయ పోరాటాన్ని క్రికెట్ అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు.