ఐపీఎల్ సీజన్ 2024 ముగిసింది.అయితే ఫైనల్ లో కేకేఆర్ జట్టు పై సన్ రైజర్స ఓటమి పాలై టైటిల్ ను చేజార్చుకుంది.కానీ ఈ సీజన్ లో యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ సన్ రైజర్స్ కి కీలక బ్యాటర్ లా మారిపోయాడు. అతని బ్యాటింగ్ చూసిన తర్వాత అంతా గురువుకి తగ్గ శిష్యుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ఐపీఎల్ సీజన్ లో అభిషేక్ శర్మ సన్ రైజర్స్ కి కీలక బ్యాటర్ లా మారిపోయాడు. ఓపెనర్ గా వచ్చి అభిషేక్ శర్మ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.దీంతో సన్ రైజర్స్ రికార్డుల మీద రికార్డులు బద్ధలు కొట్టింది.అభిషేక్ శర్మ ముంబై మీద 16బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో 12బంతుల్లో 2ఫోర్లు, 6 సిక్సర్లతో 46పరుగులు చేశాడు. యువరాజ్ సింగ్ దగ్గర బ్యాటింగ్ లో మెలకువలు నేర్చుకున్న అభిషేక్ శర్మ సన్ రైజర్స్ క్యాంప్ లో లారా దగ్గర శిక్షణ పొందాడు.
ఇటీవల అభిషేక్‌కి సక్సెస్‌కి కారణం చెప్పే ఓ వీడియో వైరల్‌గా మారింది. అందులో.. అభిషేక్ చిన్ననాటి స్నేహితుడు పంజాబ్ కింగ్స్ స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, అభిషేక్ తల్లి వద్దకు వెళ్లి, ‘అభిషేక్‌కి ఇచ్చిన ఆశీర్వాదాలు నాకు కూడా ఇవ్వండి.’ అని అడగడం కనిపిస్తుంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో అభిషేక్ అద్భుతంగా రాణించాడు. ఒక ఇన్నింగ్స్‌లో 30 బంతులు కూడా ఆడకుండా 400కు పైగా పరుగులు చేసిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు.
గత నాలుగు సంవత్సరాలుగా అభిషేక్ ఆటతీరు మెరుగుపడటానికి యువరాజ్ సింగ్ చాలా సాయం చేశాడని అభిషేక్ శర్మ రాజ్‌కుమార్ శర్మ పేర్కొన్నారు. శుభమాన్, అభిషేక్ ఇద్దరికీ శిక్షణ ఇస్తున్నప్పుడు, అభిషేక్ బ్యాటింగ్ స్టాన్స్‌ని మార్చుకోవాలని యవీ సూచించాడని చెప్పారు. స్టాన్స్ మారడంతో బ్యాక్‌లిఫ్ట్‌లో మూవ్‌మెంట్ తగ్గి, అభిషేక్ మోర్ పవర్ జనరేట్ చేయగలిగాడని వివరించారు.