IPL 2024 Young Gun: రోజు రోజుకు రాటుదేలుతున్న టీమిండియా కుర్రాడు!

ఈ మెగాటోర్నీకి ముందు టీ20 వరల్డ్ కప్ రేసులో ఆ కుర్రాడు దరిదాపుల్లో కూడా లేడు. కానీ.. టోర్నీ మొదలయ్యాక లెక్కలన్నీ మారిపోయాయి. ఆడిన ఏడు మ్యాచుల్లో 318 పరుగులు చేశాడు ఆ యువ ఆటగాడు.అతను ఎవరో తెలియాలంటే ఓ లుక్కేయండి.

New Update
IPL 2024 Young Gun: రోజు రోజుకు రాటుదేలుతున్న టీమిండియా కుర్రాడు!

ఐపీఎల్ 2024 (IPL 2024) సీజన్‌లో మరో మ్యాచ్ అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టింది. హోరాహోరీగా సాగిన పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై రాజస్థాన్ రాయల్స్ (KKR vs RR) థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. దీంతో తన జోరును కొనసాగించింది సంజూ శాంసన్ సేన.ఈ విజ‌యంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ సీజన్‌లో ఏడు మ్యాచులాడిన రాజస్థాన్ రాయల్స్ ఆరు విజయాలతో టాప్ లేపింది. ఇక, ఐపీఎల్ తర్వాత టీ20 వరల్డ్ కప్ జరగనుంది. దీంతో.. ఐపీఎల్ పై  బీసీసీఐ సెలెక్టర్లు ఓ కన్నేశారు

ధనాధన్ లీగ్ లో రాణించిన కుర్రాళ్లకి పొట్టి వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. అటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ లు కూడా ఐపీఎల్ పై ఓ కన్నేశారు. అయితే.. ఓ కుర్రాడు ఇప్పుడు రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ లకు లేనిపోని టెన్షన్ తెస్తున్నాడు.ఈ మెగాటోర్నీకి ముందు టీ20 వరల్డ్ కప్ రేసులో ఆ కుర్రాడు దరిదాపుల్లో కూడా లేడు. కానీ.. టోర్నీ మొదలయ్యాక లెక్కలన్నీ మారిపోయాయి. ఆ కుర్రాడి తన బ్యాటింగ్ తో రేసులో ఇప్పుడు అందరికన్నా ముందున్నాడు.

ఆ యంగ్ గన్ ఎవరో కాదు.. రాజస్థాన్ రాయల్స్ రియాన్ పరాగ్. ప్రతి సీజన్ బిల్డప్ బాబాయ్ అంటూ ట్రోలర్స్ చేతికి అడ్డంగా దొరికే రియాన్ పరాగ్. ఈ సారి సీజన్ లో మనోడు ఓవర్ యాక్షన్ చేయడం లేదు. కానీ, తన బ్యాట్ తో అంతకుమించిన విధ్వంసం చేస్తూ.. హైలెట్ గా నిలుస్తున్నాడు.లేటెస్ట్ గా కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై అదిరిపోయే బ్యాటింగ్ చేశాడు రియాన్ పరాగ్. కేవలం 14 బంతుల్లోనే 34 పరుగులు చేశాడు. జోస్ బట్లర్‌కి సరైన సహకారం అందించి.. రాజస్థాన్ విజయంలో కీ రోల్ ప్లే చేశాడు.

ఈ ఒక్క మ్యాచులోనే కాదు.. సీజన్ మొదలైన దగ్గర నుంచి తన సత్తా ఏంటో చాటి చెబుతున్నాడు రియాన్. ఆడిన ఏడు మ్యాచుల్లో 318 పరుగులు చేశాడు. అతని ఖాతాలో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 161. యావరేజ్ 63. ఈ లెక్కలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారుఈ ప్రదర్శనతో వరల్డ్ కప్ రేసులో ఉన్నానంటూ చాటకనే చాటి చెప్పాడు. అయితే పరాగ్‌ ఎప్పుడూ తన ఆటతో కంటే తన వింత చేష్టలతోనే ఎక్కువగా వార్తల్లో ఎక్కేవాడు. కానీ ఇప్పుడు ఆటతో కూడా అందరిని ఆకట్టుకుకుంటున్నాడు ఈ అస్సాం ఆల్‌రౌండర్‌. ఇనాళ్లు ఈ కుర్రాడిని తప్పుగా అర్థం చేసుకున్నామని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీంతో.. టీ20 వరల్డ్ కప్ జట్టులోకి ఈ కుర్రాడిని తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు..

Advertisment
తాజా కథనాలు