Team India : రేపు ఢిల్లీకి రానున్న టీమిండియా.. చార్టర్డ్ ఫ్లైట్లు ఏర్పాటు!

భారత క్రికెట్ జట్టు బార్బడోస్ నుండి చార్టర్డ్ విమానంలో బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఈ విమానం బుధవారం రాత్రి 7:45 గంటలకు నేరుగా ఢిల్లీలో ల్యాండ్ అవ్వనుంది. జట్టు సభ్యులువారి కుటుంబాలు,బీసీసీఐ అధికారులతో చార్టర్డ్ విమానం బుధవారం తెల్లవారుజామున బార్బడోస్ నుండి బయలుదేరుతుంది

Indian Cricketers : హరికేన్ బెరిల్ ఎఫెక్ట్... బార్బడోస్‌ లో చిక్కుకుపోయిన టీమిండియా!
New Update

Team India To Land In Delhi : భారత క్రికెట్ (Team India) జట్టు బార్బడోస్ (Barbados) నుండి చార్టర్డ్ విమానంలో బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఈ విమానం బుధవారం రాత్రి 7:45 గంటలకు నేరుగా ఢిల్లీలో ల్యాండ్ అవ్వనుంది. భారత క్రికెట్ జట్టు సభ్యులు, వారి కుటుంబాలు, బీసీసీఐ అధికారులతో కూడిన చార్టర్డ్ విమానం బుధవారం తెల్లవారుజామున బార్బడోస్ నుండి బయలుదేరుతుంది.

బార్బడోస్‌లో బెరిల్ హరికేన్ ప్రభావం ప్రస్తుతానికి అంత తీవ్రంగా లేదని, దీంతో టీమ్ ఇండియా స్వదేశానికి వెళ్లే అవకాశం వచ్చింది. ముందుగా అనుకున్న ప్రకారం, టీమిండియా న్యూయార్క్ (New York) మీదుగా భారత్‌కు బయలుదేరాల్సి ఉంది. బెరిల్ హరికేన్ (Beryl Hurricane) కారణంగా బార్బడోస్‌లోని విమానాశ్రయాన్ని మూసివేశారు.

జూన్ 29, శనివారం నాడు కెన్సింగ్టన్ ఓవల్‌లో T20 వరల్డ్ కప్ 2024 (T20 World Cup 2024) టైటిల్ విజయం సాధించిన తర్వాత టీమ్ ఇండియా హోటల్‌లో విజయాన్ని జరుపుకున్నారు. ఆ తరువాత అక్కడ తుఫాన్‌ ప్రబావం తీవ్రం కావడంతో అక్కడ చిక్కుకుపోయారు. ఢిల్లీలో దిగిన తర్వాత భారత బృందం ప్రధాని నరేంద్ర మోడీని కలవాలని భావిస్తున్నారు.

Also read: సీఎం చంద్రబాబు ఇంటి కోసం లంచం డిమాండ్‌…సర్వేయర్‌ సస్పెండ్‌!

#delhi #t20-world-cup-2024 #barbadose #tem-india
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe