IND vs ENG : ఇంగ్లాండ్(England) తో టెస్టులో భారత్(India) భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఇంగ్లీష్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 175 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కేఎల్ రాహుల్ (86 పరుగులు; 123 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), రవీంద్ర జడేజా(Jadeja) (81 నాటౌట్: 155 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించడంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేయగలిగింది.
వన్డే తరహాలో ఆడిన రాహుల్(KL Rahul) సెంచరీకి చేరువైన తరుణంలో ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(Axar Patel) (35 నాటౌట్)కు జతకలిసిన జడేజా ఇంగ్లిష్ జట్టు సహనాన్ని పరీక్షించాడు. ఆఖరులో అక్షర్ దూకుడుగా ఆడడంతో టీమిండియా స్కోరు 400 పరుగుల మైలురాయిని దాటింది. ఎనిమిదో వికెట్‌కు వీళ్లు 63 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ హర్ట్లే, జో రూట్ తలో రెండు వికెట్లు తీశారు.
ఇది కూడా చదవండి: Virat Kohli: ద వన్ అండ్ ఓన్లీ ప్లేయర్..మరో సరికొత్త రికార్డ్‌తో విరాట్ కోహ్లీ చరిత్ర
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోర్ 119/1తో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా ఫస్ట్ సెషన్‌లోనే ఓపెనర్ యశస్వీ జైస్వాల్(80), శుభ్‌మన్ గిల్(23) వికెట్లు కోల్పోయినా, తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ నిర్మించారు. రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో అయ్యర్ ఔటైన కాసేపటికే, రాహుల్ హర్ట్లేను పెవిలియన్‌కు పంపాడు. తర్వాత కీపర్ శ్రీకర్ భరత్, జడేజా పోరాడడంతో భారత్ ఆధిక్యం 150 పరుగులు దాటింది. రెండో రోజు మ్యాచ్ ముగిసేటప్పటికి టీమిండియా మొత్తంగా 175 రన్స్ లీడ్ సాధించింది.