Laxman: కోచ్‌గా లక్ష్మణ్‌ వద్దంటున్న ఫ్యాన్స్‌.. ఇదేం లాజిక్‌ భయ్యా!

హెడ్‌కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌ వద్దంటున్నారు ఫ్యాన్స్‌. వచ్చే టీ20 వరల్డ్‌కప్‌ ఉందని.. అగ్రెసివ్‌ కోచ్‌ కావాలని చెబుతున్నారు. అయితే లక్ష్మణ్‌ బ్యాటింగ్‌ టెక్నిక్‌, అతని సహనం గురించి అందరికి తెలుసని.. లక్ష్మణ్‌ నుంచి యువకులు ఎంతో నేర్చుకోవచ్చని క్రికెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ అభిప్రాయపడుతున్నారు.

Laxman: కోచ్‌గా లక్ష్మణ్‌ వద్దంటున్న ఫ్యాన్స్‌.. ఇదేం లాజిక్‌ భయ్యా!
New Update

హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌(Rahul Dravid) టెన్యూర్‌ ముగిసింది. వరల్డ్‌కప్‌ ముగింపుతో ద్రవిడ్‌ పదవీకాలంలో ముగియడంతో నెక్ట్స్‌ హెడ్‌కోచ్‌ ఎవరన్నదానిపై అందరిచూపు నెలకొంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు కోచ్‌గా టీమిండియా మాజీ బ్యాటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌(VVS Laxman) వ్యవహరిస్తున్నాడు. లక్ష్మణ్‌కే పూర్తి స్థాయి బాధ్యతలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సుదీర్ఘకాలం పాటు టీమిండియా టెస్టు జట్టుకు ఎనలేని సేవలు అందించిన లక్ష్మణ్‌ అనుభవం భారత్‌ జట్టుకు ఎంతగానో కలిసి వస్తుంది అయితే పలువురు అభిమానులు మాత్రం లక్ష్మణ్‌ను హెడ్‌ కోచ్‌గా చేయవద్దని చెబుతున్నారు.


లక్ష్మణ్‌ వద్దు:
వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. ఇప్పటికే వన్డే ప్రపంచకప్‌ ఓడిపోయిన బాధలో ఉన్నారు అభిమానులు. 2013నుంచి ఐసీసీ ట్రోఫీ లేదని తెగ బాధపడిపోతున్నారు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ అయినా గెలవాలని కోరుకుంటున్నారు. టీ20 భవిష్యత్‌ ప్రణాళికల దృష్ట్యా యువ జట్టునే ముందుకు నడిపించాలని బీసీసీఐ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే కోహ్లీ, రోహిత్‌ను చాలా కాలంగా టీ20లకు దూరంగా ఉంచుతోంది. వీరిద్దరు కూడా లాంగ్‌ ఫార్మెట్లవైపే ఆసక్తి చూపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఒకవేళ లక్ష్మణ్‌ హెడ్‌కోచ్‌గా ఎంపికైతే యువ జట్టుకు హైదరాబాదీ స్టార్‌ టెక్నిక్స్‌ నేర్పించాల్సి ఉంటుంది. అయితే లక్ష్మణ్‌ టెస్టు ప్లేయర్ అని.. టీ20లకు అతను కోచ్‌గా వద్దంటున్నారు పలువురు ఫ్యాన్స్.

ఇదేం లాజిక్ భయ్యా!
మరోవైపు విశ్లేషకులు మాత్రం హెడ్‌కోచ్‌గా లక్ష్మణ్‌ బెస్ట్ అంటున్నారు. టెస్ట్ ప్లేయర్‌, టీ20 ప్లేయర్‌ అన్నది మేటర్ కాదని కుండబద్దలు కొడుతున్నారు. లక్ష్మణ్‌ బ్యాటింగ్‌ టెక్నిక్స్‌, అనుభవం నుంచి యువ జట్టు ఎంతో నేర్చుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. అందులోనూ లక్ష్మణ్‌కు ఒత్తిడిలో అద్భుతంగా బ్యాటింగ్‌ చేసిన ఎక్స్‌పిరియన్స్‌ ఉంది. నాటి పటిష్ట ఆస్ట్రేలియన్లలే కంగారు పెట్టించిన లక్ష్మణ్‌ కోచ్‌గా మారడం టీమండియాకు ప్రయోజనం తీసుకొస్తుందే కానీ.. ఈ టీ20 లాజిక్‌లు కరెక్ట్‌ కాదని చెబుతున్నారు.

Also Read: కోహ్లీ, రోహిత్‌ టీ20 కెరీర్‌పై తేల్చేసిన స్టార్ బౌలర్.. ఏమన్నాడంటే!

WATCH:

#cricket #vvx-laxman
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe