భారత్‌లో క్రికెట్ పరంగా టాలెంట్‌కు కొదవలేదు. లెజండ్‌లు రిటైర్‌మెంట్ ప్రకటించి వెళ్లిపోయినా.. స్టార్లు గాయాపాలై రెస్ట్ తీసుకున్నా.. యువకులు జట్టులోకి రావడమే కాదు.. ఆకలిగొన్న పులిలా వేటాడుతారు. తమ ప్రతాపాన్ని చూపిస్తారు. జట్టులో స్థానం కోసం ఎంతో కాలం వెయిట్ చేసే ప్లేయర్లు ఓవైపు ఉంటే.. మరికొందరు తక్కువ వయసులోనే గేమ్‌లోకి ఎంట్రీ ఇస్తారు. సత్తా చాటుతారు కూడా. ఆ లిస్ట్‌లోకే వస్తాడు టీమిండియా యువ సంచలనం రవి బిష్ణోయ్(Ravi Bishnoi). 23ఏళ్ల టీమిండియా లెగ్ స్పిన్నర్ టీ20 ఫార్మెట్‌లో నంబర్-1 బౌలర్‌గా అవతరించాడు.
రషీద్‌ఖాన్‌ను పక్కకు నెట్టి:
ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో రవి బిష్ణోయ్ నంబర్-1 స్థానంలో నిలిచాడు. అఫ్ఘాన్ స్టార్ స్పిన్నర్ రషీద్‌ఖాన్‌ను పక్కకు నెట్టి మరి బిష్ణోయ్ అగ్రస్థానానికి వచ్చాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన టీ20 సిరీస్‌లో రవి బిష్ణోయ్ అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నాడు రవి బిష్ణోయ్. టీ20 క్రికెట్‌లో ఆయన నంబర్-1 బౌలర్. ఆస్ట్రేలియా సిరీస్‌లోని ఐదు మ్యాచ్‌లలో 18.22 యావరేజ్‌తో వికెట్లు తీశాడు రవి బిష్ణోయ్. ఈ సిరీస్‌లో మొత్తం తొమ్మిది వికెట్లు తీశాడు.
ఫిబ్రవరి 2022లో అరంగేట్రం చేసినప్పటి నుంచి రవి బిష్ణోయ్ 17.38 బౌలింగ్ యావరేజ్‌తో బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పటివరకు మొత్తం 34 అంతర్జాతీయ టీ20 వికెట్లను పడగొట్టాడు. స్ట్రైక్ రేట్ 14.5గా ఎకానమి కేవలం 7గానే నమోదైంది. ప్రస్తుత బ్యాటింగ్ కండిషన్స్‌లో రవి బిష్ణోయ్ ఓవర్‌కు 7 చొప్పునే పరుగులు ఇస్తుండడం విశేషం.
Also Read: చరిత్ర సృష్టించడమే టార్గెట్.. దక్షిణాఫ్రికా టూర్ కు విమానమెక్కిన టీమిండియా..
WATCH: