Team India Cricketer Venkatesh Iyer Marriage : టీమిండియా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ తాజాగా ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి శృతి రఘునాథన్ ని (Shruti Raghunathan) పెళ్లి చేసుకున్నాడు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఆదివారం రోజు వీరి పెళ్లి సాంప్రదాయ పద్దతిలో జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వెంకటేష్ అయ్యర్ పెళ్లి చేసుకున్నాడనే విషయం తెలిసి నెటిజన్స్, క్రికెట్ లవర్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక వెంకటేష్ అయ్యర్ విషయానికొస్తే.. 1994 డిసెంబర్ 5 న మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో జన్మించాడు. దేశవాళీ క్రికెట్ లో తన ఆట తీరుతో ఆకట్టుకున్న ఈ ఆల్ రౌండర్.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు.
Also Read : T20 ప్రపంచకప్‌లో గెలిచిన జట్టుకు ఎంత డబ్బు వస్తుంది?
ఇండియా వేదికగా న్యూజిలాండ్ తో టీ 20 సందర్భంగా ఇంటర్నేషనల్ టీ 20 లో ఎంట్రీ ఇచ్చిన అయ్యర్.. మరువతి ఏడాదే వన్డే లోనూ అడుగు పెట్టాడు. తన అంతర్జాతీయ కెరీర్ లో 2 వన్డే, 9 టీ 20 మ్యాచ్ లు ఆడి 24, 133 పరుగులు సాధించాడు. అలాగే తన టీ 20 ఫార్మాట్ లో 5 వికెట్లు పడగొట్టాడు. ఇక రీసెంట్ గా జరిగిన ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్ మ్యాచ్ లో ఒంటి చేత్తో KKR ని గెలిపించి కోల్ కతా ఛాంపియన్స్ గా నిలవడంతో కీలక పాత్ర పోషించాడు.