Asia cup: అందరి లెక్కలు తేల్చేసిన రోహిత్‌ శర్మ.. గట్టిగా ఇచ్చిపడేశాడుగా..!

టెస్టుల్లోనూ తాను పరిణితి చెందిన ఆటగాడినేనని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ విమర్శకుల మూతికి తాళాలు వేశాడు. రెండు మూడేళ్లుగా టెస్టుల్లో తాను ఆడిన ఇన్నింగ్స్‌లు చూసి మాట్లాడాలని చురకలంటించాడు. టెస్టుల్లో ఇండియాలో స్పిన్‌ ట్రాక్‌లు ఎంతో ఛాలెంజింగ్‌గా ఉంటాయని.. విదేశీ గడ్డలపై కంటే స్వదేశి గడ్డపై బ్యాటింగ్‌ చేయడం ఎంతో సవాల్‌గా మారిందన్నాడు హిట్‌మ్యాన్‌.

Asia cup: అందరి లెక్కలు తేల్చేసిన రోహిత్‌ శర్మ.. గట్టిగా ఇచ్చిపడేశాడుగా..!
New Update

Rohit Sharma buries home vs overseas debate with hard-hitting facts: రోహిత్‌ శర్మ(Rohit sharma) కెరీర్‌ ఆరంభంలో మిడిలార్డర్‌లో పెద్దగా రాణించింది లేదు.. ఫ్లాట్‌ట్రాక్‌లపైనే ఆడుతాడని.. టెస్టులకు పనికిరాడని.. క్రీజులోకి వచ్చిన రెండు నిమిషాలకే వికెట్‌ సమర్పించుకునే మ్యాగీమ్యాన్‌ అని భయాంకర ట్రోల్స్‌ జరిగేవి.. అయితే అదంతా 2013కు ముందు మాటలు.. ఓపెనర్‌గా అవతారం ఎత్తిన తర్వాత మ్యాగీమ్యాన్‌ హిట్‌మ్యాన్‌గా మారిపోయాడు.. క్రికెట్‌ చరిత్రలో ఎవరికి సాధ్యం కాని రికార్డులను క్రియేట్ చేశాడు.. వన్డేల్లో ఏకంగా మూడు సార్లు డబుల్ సెంచరీ చేసిన ఏకైక ప్లేయర్‌ రోహిత్‌ శర్మ.. అయితే టెస్టుల్లో(tests) మాత్రం రోహిత్ సక్సెస్‌ కావడానికి చాలా టైమ్‌ పట్టింది. రెండు మూడేళ్లుగా రోహిత్‌ టెస్టుల్లోనూ టీమిండియాకు పెద్ద దిక్కయ్యాడు. అయితే ఎంత నిరూపించుకున్నా రోహిత్‌ని విమర్శించేవాళ్లు ఉన్నారు.. పాత ట్రోల్స్‌నే కంటిన్యూ చేస్తూ కాలం గడుపుతుంటారు. అలాంటివారందరికి తనదైన శైలిలో ఇచ్చిపడేశాడు టీమిండియా సారధి.



లెక్కలు చూసి మాట్లడండి బ్రో:

టెస్టుల్లో సౌతాఫ్రికా(south africa)తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో ఓపెనర్‌గా ప్రమోట్ అయినప్పటి నుంచి రోహిత్ క్లాసిక్ సెంచరీలు చేశాడు. ఇదే విషయాలను గుర్తు చేస్తూ రోహిత్‌ విమర్శకుల మూతికి తాళం వేశాడు. 'భారత్‌లో ఇటీవల నా టెస్టు ఇన్నింగ్స్‌లను చూడండి. ముఖ్యంగా గత 2-3 ఏళ్లలో విదేశాల్లో బ్యాటింగ్ చేయడం కంటే ఇండియాలో బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా మారింది. మేం టెస్టులు ఆడిన పిచ్‌లు, విదేశాల కంటే సవాలుతో కూడుకున్నవి. బౌలర్లకు అనుకూలించిన పిచ్‌లపై నేను బాగా ఆడాను' అని రోహిత్ చెప్పాడు.



రోహిత్ చెప్పింది నిజమే కదా:

వాస్తవానికి.. విదేశాల్లో కంటే స్వదేశంలో ఎక్కువగా పరుగులు చేసిన భారత బ్యాటర్లలో రోహిత్ ఒకడు. అయితే ప్రస్తుతం టెస్ట్‌ పిచ్‌లు స్పిన్‌కి ఎక్కువగా అనుకూలిస్తున్నాయి. ఆ పిచ్‌లపై పరుగులు పిండుకోవడం కొంచెం కష్టమనే చెప్పాలి. వన్డేల్లో విదేశీ పిచ్‌లపైనా రోహిత్ భారీగా పరుగులు చేసింది నిజమే కానీ.. టెస్టుల్లో మాత్రం మూడేళ్లుగానే రోహిత్‌ తన మార్క్‌ని చూపిస్తూ వస్తున్నాడు. ఇంగ్లండ్‌ ఓవల్‌ పిచ్‌పై రోహిత్ చేసిన సెంచరీ చూస్తే అతని ట్యాలెంట్‌ తెలుస్తుంది. టెస్టుల్లో ఇటివలి కాలంలో రోహిత్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. చెన్నై స్పిన్‌ ట్రాక్‌, నాగ్‌పూర్‌ స్పిన్‌ వికెట్‌పై సెంచరీలు చేశాడు. రోహిత్‌ ఇప్పుడు పూర్తిస్థాయి టెస్టు ప్లేయర్ కూడా.. అయినా కానీ మీడియా సమావేశాల్లో పలువురు గతాన్ని తవ్వితీసి ప్రశ్నలు అడుగుతుంటారు. అలాంటివారికి రోహిత్ దిమ్మదిరిగే సమాధానం చెప్పాడు. ఇక ఆసియా కప్‌లో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్‌ని సెప్టెంబర్‌ 2న పాకిస్థాన్‌తో ఆడనుంది.

ALSO READ: గాయాలే కొంపముంచాయి.. నంబర్‌4,5 పొజిషన్స్‌ గురించే అప్పుడే చెప్పాం కదా!

#rohit-sharma #asia-cup-2023
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe