IND vs SL Asia Cup 2023: దుమ్ము రేపిన సిరాజ్.. ఒకే ఓవర్లో 4 వికెట్లు.. సరికొత్త రికార్డ్..

ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఇండియన్ క్రికెట్ అభిమానులకు మాంచి కిక్ ఇస్తోంది. ఫైనల్ మ్యాచ్ ఎంతో టఫ్‌గా ఉండొచ్చని ఊహించుకుంటే.. ఇండియన్ బౌలర్ల దెబ్బకు శ్రీలంక కుదేలైంది. జస్ట్ 12 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి.. అత్యంత చెత్త రికార్డ్ నమోదు చేసింది.

New Update
IND vs SL Asia Cup 2023: దుమ్ము రేపిన సిరాజ్.. ఒకే ఓవర్లో 4 వికెట్లు.. సరికొత్త రికార్డ్..

IND vs SL Asia Cup 2023: ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఇండియన్ క్రికెట్ అభిమానులకు మాంచి కిక్ ఇస్తోంది. ఫైనల్ మ్యాచ్ ఎంతో టఫ్‌గా ఉండొచ్చని ఊహించుకుంటే.. ఇండియన్ బౌలర్ల దెబ్బకు శ్రీలంక కుదేలైంది. జస్ట్ 12 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి.. అత్యంత చెత్త రికార్డ్ నమోదు చేసింద. ఇక ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ సిరాజ్ దుమ్ము రేపాడు. సిరాజ్ బంతిని ఫేస్ చేయలేక లంక బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ బాట పట్టారు. సిరాజ్ వేసిన నాలుగో ఓవర్‌లో 4 వికెట్లు పడగొట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆ తరువాతి ఓవర్ లో మరో వికెట్ పడగొట్టిన సిరాజ్.. తన ఖాతాలో మొత్తం 6 వికెట్లువేసుకున్నాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక బ్యాట్స్‌మెన్ క్రీజ్‌లోకి వచ్చారు. నిస్సంక, కుశాల్ పెరెరా ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఇక మన సైడ్ నుంచి ఫస్ట్ బౌలింగ్ బుమ్రా చేశాడు. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ కుశాల్ పెరెరాను పెవిలియన్ పంపించాడు బుమ్రా. ఆ తరువాత సెకండ్ ఓవర్ బౌలింగ్ అందుకున్న మహ్మద్ సిరాజ్.. సెకండ్ ఓవర్‌ మేడిన్ చేశాడు. ఒక్క పరుగు చేసే ఛాన్స్ ఇవ్వలేదు. ఇక ఆ తరువాత వేసిన ఓవర్‌లో అంటే 4వ ఓవర్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. అంటే ఒక్క ఓవర్‌లోనే నాలుగు వికెట్ల పడగొట్టి క్రికెట్ హిస్టరీలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్ గా నిలిచాడు. ఆ తరువాత మరో రెండు వికెట్లు పడగొట్టి మొత్తం 6 వికెట్లు తీసుకున్నాడు.

2002 నుంచి వన్డేల్లో తొలి పది ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసుకున్న ఇండియన్ బౌలర్స్ వీరే..

  1. మహ్మద్ సిరాజ్ (5 వికెట్లు) - శ్రీలంకపై(కొలంబో) 2023.
  2. జవగల్ శ్రీనాథ్ (4 వికెట్లు) - శ్రీలంకపై (జోహెన్నస్ బర్గ్) 2003.
  3. భువనేశ్వర్ (4 వికెట్లు) - శ్రీలంకపై (పోర్ట్ ఆఫ్ స్పెయిన్) 2013.
  4. జస్పీత్ బుమ్రా (4 వికెట్లు) - ఇంగ్లండ్ (ది ఓవల్) 2022.

భారత్ తరఫున వన్డేల్లో తక్కువ స్కోర్‌తో ఎక్కువ వికెట్లు తీసుకున్న బౌలర్ల వివరాలు చూద్దాం..

  1. స్టువర్ట్ బిన్నీ – 6/4 vs బంగ్లాదేశ్ 2014
  2. అనిల్ కుంబ్లే – 6/12 vs వెస్టిండీస్ 1993
  3. జస్ప్రీత్ బుమ్రా – 6/19 vs ఇంగ్లండ్ 2022
  4. మహ్మద్ సిరాజ్ – 6/21 vs శ్రీలంక 2023
  5. ఆశిష్ నెహ్రా – 6/23 vs ఇంగ్లండ్ 2003
  6. కుల్దీప్ యాదవ్ – 6/25 vs ఇంగ్లండ్ 2018
  7. మురళీ కార్తీక్ – 6/27 vs ఆస్ట్రేలియా 2007
  8. అజిత్ అగార్కర్ – 6/42 vs ఆస్ట్రేలియా 2004
  9. యుజ్వేంద్ర చాహల్ – 6/42 vs ఆస్ట్రేలియా 2019
  10. అమిత్ మిశ్రా – 6/48 vs జింబాబ్వే 2013
  11. ఎస్ శ్రీశాంత్ – 6/55 vs ఇంగ్లండ్ 2006
  12. ఆశిష్ నెహ్రా – 6/59 vs శ్రీలంక 2005

Also Read:

Vegh S60: వెగ్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒకసారి ఛార్జ్ చేస్తే 120+ కి.మి రేంజ్.. ధర, ఫీచర్ల వివరాలివే..

Asia Cup 2023 final Live Score🔴: హైదరాబాదీ పేసర్‌ ధాటికి కుప్పకూలిన శ్రీలంక

Advertisment
Advertisment
తాజా కథనాలు