తొలి టెస్టులో అదరగొట్టిన రోహిత్ సేన.. వెస్టిండీస్ జట్టుపై అద్భుత విజయం వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. 141 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో అద్భుత విజయం సాధించి మూడు రోజుల్లోనే ఆటను ముగించింది. విండీస్ ఆటగాళ్లు కనీసం పోరాటపటిమ కూడా చూపించకుండా చేతులెత్తేశారు. By BalaMurali Krishna 15 Jul 2023 in Scrolling స్పోర్ట్స్ New Update షేర్ చేయండి అద్భుత విజయం.. భారత్ సొంతం.. 2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ తొలి సిరీస్‌ను రోహిత్ సేన ఘనంగా ప్రారంభించింది. డొమినికా వేదికగా విండీస్ జట్టుతో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించింది. మిస్టర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ఇరగదీశాడు. రెండు ఇన్నింగ్సుల్లో కలిపి 12 వికెట్లు తీసి కరేబియన్ల నడ్డి విరిచాడు. మరోవైపు అరంగేట్ర టెస్టు మ్యాచులోనే యంగ్ సెన్సేషన్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ 171 పరుగులతో అదరగొట్టాడు. ఇక కెప్టెన్‌గా రోహిత్ శర్మ కూడా సెంచరీ(103) సాధించింది తనదైన పాత్ర పోషించాడు. మొత్తానికి టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా 1-0 ఆధిక్యంలో నిలిచింది. WHAT. A. WIN! 🙌 🙌A cracking performance from #TeamIndia to win the first #WIvIND Test in Dominica 👏 👏Scorecard ▶️ https://t.co/FWI05P4Bnd pic.twitter.com/lqXi8UyKf1 — BCCI (@BCCI) July 14, 2023 చేతులెత్తేసిన విండీస్ ప్లేయర్లు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు భారత బౌలర్ల ధాటికి కేవలం 150 పరుగులకే ఆలౌట్ అయింది. అశ్విన్ ఐదు వికెట్లతో సత్తా చాటగా, జడేజా మూడు వికెట్లతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు గొప్ప ప్రారంభం లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, జైస్వాల్ సెంచరీలతో కదం తొక్కారు. ముఖ్యంగా డెబ్యూ ప్లేయర్ యశస్వి జైస్వాల్ అయితే తొలి మ్యాచులోనే ఇరగదీసి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక కింగ్ కోహ్లీ కూడా 76 పరుగులతో తనదైన పాత్ర పోషించాడు. దాంతో తొలి ఇన్నింగ్స్‌ను 421/5 పరుగులు చేసి 271 పరుగుల ఆధిక్యంతో డిక్లేర్ చేసింది. 272 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ ప్లేయర్లు తొలి ఇన్నింగ్స్ కంటే ఘోరంగా విఫలమయ్యారు. అశ్విన్, జడేజా స్పిన్ మాయాజాలంతో వరుసగా పెవిలియన్ బాట పట్టారు. గ్రౌండ్‌లోకి వచ్చినంత సేపు కూడా క్రీజులో నిలవలేకపోయారు. ఈ ఇన్నింగ్స్‌లో అశ్విన్ 7 వికెట్లు తీయగా.. జడ్డూ 2 వికెట్లు తీశాడు. దీంతో అద్భుత విజయం టీమిండియా సొంతమైంది. రెండో టెస్టు మ్యాచ్ జులై 20న ప్రారంభం కానుంది. భారత ఆటగాళ్ల ఖాతాలో పలు రికార్డులు ఇక తొలి టెస్టులో సూపర్ ఫర్ఫామెన్స్‌తో భారత ఆటగాళ్లు పలు రికార్డులు తమ ఖాతాలో వేసుకున్నారు. 12 వికెట్లతో అదరగొట్టిన అశ్విన్.. హర్భజన్ సింగ్(707) రికార్డును అధిగమించి.. ఇండియా తరపున అన్ని ఫార్మాట్లలో అత్యధిక వికెట్లు(709) తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. అత్యధిక వికెట్లు(953) తీసిన మొదటి బౌలర్‌గా దిగ్గజ ఆటగాడు అనిల్ కుంబ్లే ఉన్నాడు. అలాగే ఒక మ్యాచులో పది లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన జాబితాలోనూ కుంబ్లే సరసన అశ్విన్ నిలిచాడు. ఎనిమిది సార్లు ఈ రికార్డును చేరుకున్నాడు. అటు అరంగేట్ర టెస్టు మ్యాచులోనే విదేశాల్లో 150 కన్నా ఎక్కువ పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా యశస్వి జైస్వాల్ నిలిచాడు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి