TS: జుట్టు కత్తిరిస్తే.. సస్పెండ్ చేసేస్తారా?.. టీచర్ శిరీషకు ఉపాధ్యాయ సంఘాల మద్దతు..!

ఖమ్మంలో టీచర్ శిరీషకు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల విద్యార్థుల హెయిర్ కట్ సరిగా లేదంటూ ఉపాధ్యాయురాలు శిరీష కత్తెరతో జుట్టు కత్తిరించారు. దీంతో ఉన్నతాధికారులు ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు.

New Update
TS:  జుట్టు కత్తిరిస్తే.. సస్పెండ్ చేసేస్తారా?.. టీచర్ శిరీషకు ఉపాధ్యాయ సంఘాల మద్దతు..!

Khammam: ఖమ్మం జిల్లాలో టీచర్ శిరీషకు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. టీచర్ శిరీషపై సస్పెన్షన్.. ఉపాధ్యాయులను నిరుత్సాహానికి గురిచేస్తుందంటున్నారు యూనియన్ల లీడర్లు. విద్యార్థుల జుట్టు కత్తిరింపు ఘటనను నైతిక బోధనగా చూడాలన్నారు.

ఇటీవల విద్యార్థుల హెయిర్ కట్ సక్రమంగా లేదంటూ ఉపాధ్యాయురాలు శిరీష కత్తెరతో జుట్టు కత్తిరించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉపాధ్యాయురాలు శిరీష తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహానికి లోనై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీరియస్ అయిన అధికారులు పేరువంచ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ బోధిస్తున్న టీచర్ శిరీషపై సస్పెన్షన్ వేటు వేశారు.

అయితే, టీచర్ శిరీషకు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. ప్రాథమిక విచారణ కూడా చేయకుండా నేరుగా సస్పెండ్ చేయడం సరి కాదంటున్నారు ఉపాధ్యాయులు. సస్పెన్షన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, విద్యాశాఖ ఉన్నతాధికారులు మాత్రం నిబంధనల ప్రకారమే వ్యవహరించామంటున్నారు.

Advertisment
తాజా కథనాలు