Viral: క్లాస్‌రూమ్‌లో ఐటెం సాంగ్‌కు డ్యాన్స్ చేసిన టీచర్.. నెటిజన్లు షాక్!

ఓ లేడీ టీచర్ క్లాస్‌రూమ్‌లో ఐటెం సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. శారీలో విద్యార్థులతో కలిసి బ్లాక్ బోర్డ్ ముందు దుమ్మురేపిన ఆమె వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. దీనిపై కొందరు విమర్శలు చేస్తుంటే మరికొందరు పొగిడేస్తున్నారు.

New Update
Viral: క్లాస్‌రూమ్‌లో ఐటెం సాంగ్‌కు డ్యాన్స్ చేసిన టీచర్.. నెటిజన్లు షాక్!

Teacher dance: ఓ లేడీ టీచర్ క్లాస్‌రూమ్‌లో ఐటెం సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. శారీలో విద్యార్థులతో కలిసి బ్లాక్ బోర్డ్ ముందు దుమ్మురేపిన ఆమె వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేయగా.. అదే స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ వీడియో పోస్ట్ చేసిన గంటల్లోనే ఆరు లక్షలకు పైగా వ్యూస్ పొందడం విశేషం. కాగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

హిందీ పాటకు చిందులు..
ఈ మేరకు వీడియో క్లిప్‌లో ఉన్న మహిళ పేరు రష్మీగా గుర్తించబడగా ఆమె ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. అయితే విద్యార్థులతో కలిసి ‘కజ్రా రే’ అనే హిందీ పాటకు చిందులేయగా అక్కడున్నవారు నెట్టింట షేర్ చేశారు. ఆమెతోపాటు కొంతమంది విద్యార్థులు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఇక ఈ వీడియోకు ‘హ్యాపీ బర్త్‌డే రష్మీ మేడమ్’ అనే క్యా్ప్షన్ రాసివుంది. ఇక ఈ సంఘటన బెంగుళూరులోని క్రైస్ట్ యూనివర్శిటీలో జరిగినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Sadhguru: సద్గురుపై పాము దాడి.. ఒకేసారి మూడు కాట్లు!

టీచర్ డ్యాన్స్ పై స్పందిస్తున్న నెటిజన్లు.. ఈ చర్యను తగదంటున్నారు. ఇది ఆమోదయోగ్యం కానిదంటూ విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమెను మెచ్చుకుంటున్నారు.

Advertisment
తాజా కథనాలు