టీడీపీ యువనేత నారా లోకేశ్ యాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యకర్తల్లో కొత్త జోష్ నింపుతోంది. యువగళంతో విజయవాడ ప్రకాశం బ్యారేజి పోటెత్తింది. నారా లోకేశ్ యువగళానికి టీడీపీ కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పూర్తయిన యువగళం పాదయాత్ర.. విజయవాడలోకి అలా ఎంట్రి ఇచ్చిందో లేదో ఇలా కార్యకర్తలు లోకేశ్‌ని చూసేందుకు భారీగా తరలివచ్చారు. ప్రకాశం బ్యారేజివద్ద ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు లోకేశ్‌కి సెండ్ ఆఫ్ ఇచ్చారు. పసుపు, ఎరుపురంగు బెలూన్లతో ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు యువనేతను స్వాగతించారు.
జనసంద్రం:
ప్రకాశం బ్యారేజి పరిసరాలు జనంతో జనసంద్రంగా మారాయి. ఆనందోత్సాహాల నడుమ కేరింతలు కొడుతున్నారు పార్టీ కార్యకర్తలు, అభిమానులు. బాణాసంచా మోతలు, నినాదాలతో ప్రకాశం బ్యారేజి పరిసరాలు హోరెత్తుతున్నాయి. భారీ గజమాలలు, పూలవర్షంతో యువనేతను ముంచెత్తుతున్నారు అభిమానులు.
లోకేశ్‌పై విమర్శలు:
సీఎం జగన్ సైకోయిజానికి సజీవ ఉదాహరణ ప్రజావేదిక కూల్చివేత అని, ఆయన పతనం ఇక్కడే త్వరలోనే మొదలవుతుందని నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. పేదలకు 20 వేల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఇళ్లను నిర్మించడంతో పాటు అటవీ, అసైన్డ్, ఇతర భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. విజయవాడ (పశ్చిమ) అసెంబ్లీ సెగ్మెంట్‌కు చెందిన ఆర్య వైశ్య సామాజికవర్గ ప్రతినిధులు లోకేష్‌తో సమావేశమై టీడీపీ హయాంలో తమకు అత్యున్నత గౌరవం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసిన ఘనత మొత్తం మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్‌కు నిధులు లేవని లోకేశ్‌కు చెప్పారు. మరోవైపు మక్కా ట్రిప్‌కు వెళ్లడం అనేది ముస్లిం కమ్యూనిటీ ప్రజల జీవితకాల కల. తాజాగా నంద్యాలకు చెందిన ఓ వృద్ధురాలకు లోకేశ్ రూ.1.5 లక్షలు ఇచ్చారు.