TDP Victory: ఒకటీ రెండూ మూడూ.. ఆరో ఎనిమిది పది.. ఇవి ఏదో విద్యాసంస్థ ర్యాంకుల ప్రకటన కాదు. ఈరోజు ఉదయం నుంచి ఏపీ అసెంబ్లీల ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీడీపీ కూటమి లీడ్స్.. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు.. ఏపీ ఎన్నికలు మరో ఎత్తు.. అన్నట్టు ప్రచారం సాగింది. హోరాహోరీ పోరు.. నువ్వా.. నేనా అంటూ ప్రచారం.. ప్రజల్లో పెరిగిపోయిన ఉత్కంఠ. ఎన్నికలకు.. ఫలితాలకు మధ్య చాలా రోజుల గ్యాప్ ఉండడంతో రోజుకోరకం ప్రచారం తెరమీదకు వచ్చి.. ఏ పార్టీ గెలుస్తుంది అనే టెన్షన్ క్రియేట్ అయింది. ఎగ్జిట్ పోల్స్ కూడా గందరగోళం చేశాయి. టీడీపీ గెలుస్తుందని చాలా ఎగ్జిట్ పోల్స్ చెప్పినా.. మెజార్టీ విషయంలో చాలా తక్కువ మార్జిన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై ఉత్సుకత మరింత పెరిగిపోయింది.
అయితే, కౌంటింగ్ స్టార్ట్ అయినా దగ్గర నుంచి.. ప్రతి దశలోనూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. వరుసగా ప్రతి రౌండ్ లోనూ ఎన్డీయే కూటమి అభ్యర్థులు ప్రత్యర్థుల కంటే ఎక్కువ ఓట్లు సాధిస్తూ వచ్చారు. మెజార్టీ స్థానాల్లో కూటమి విజయం దిశగా పరుగులు తీయడం ప్రారంభించింది. అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ వార్ వన్ సైడ్ అయిపోయింది. మంత్రులంతా ఓటమి వైపు జారిపోయారు. విస్పష్టంగా ప్రజలు వైసీపీకి షాక్ ఇచ్చారు.
TDP Victory: పూర్తి స్థాయిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి పట్టం కట్టారు. వైసీపీకి ఎలాంటి చావుదెబ్బ కొట్టారంటే.. 21 స్థానాల్లో పోటీచేసిన జనసేన 19 సీట్లు గెలిచే దిశలో దూసుకుపోతోంది. అయితే, వైసీపీ కేవలం 17 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. అంటే కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ తాను ఏది చెప్పాడో అది చేసి చూపించాడు.
TDP Victory: ప్రభుత్వ వ్యతిరేకత లేదు అంటూ చెబుతూ వచ్చిన వైసీపీ నేతలకు.. ఉన్నదే అది అని నిరూపించారు ప్రజలు. సింహం సింగిల్ గా వస్తుంది అని చెప్పిన నాయకులకు.. అవును మమ్మల్ని వేటాడేస్తుందని భయంగా ఉంది అంటూ ఓటుతో చావుదెబ్బ కొట్టారు. మొత్తంగా ఏపీ చరిత్రలో లేని విధంగా టీడీపీ కూటమి విజయ దుందుభి మోగిస్తోంది. సంబరాల్లో మునిగి తేలిపోతున్నారు కార్యకర్తలు.. ఏపీ ప్రజలు.