వంగవీటి రాధాకృష్ణ పెళ్లి డేట్ ఫిక్స్‌..ఎప్పుడో తెలుసా..?

వంగవీటి రాధాకృష్ణ పెళ్లి డేట్ ఫిక్స్‌ అయింది. ఈ నెల 22న వంగవీటి రాధాకృష్ణ నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి, అమ్మాణి దంపతుల కుమార్తె జక్కం పుష్ప వల్లిని పెళ్లి చేసుకోనున్నారు. ఈ వివాహానికి విజయవాడ సమీపంలోని మురళి రిసార్ట్ వేదిక కానుంది.

New Update
వంగవీటి రాధాకృష్ణ పెళ్లి డేట్ ఫిక్స్‌..ఎప్పుడో తెలుసా..?

vangaveeti Radha:  వంగవీటి రాధాకృష్ణ పెళ్లి డేట్ ఫిక్స్‌ అయింది. ఈ నెల 22న వంగవీటి రాధాకృష్ణ నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి, అమ్మాణి దంపతుల కుమార్తె జక్కం పుష్ప వల్లిని పెళ్లి చేసుకోనున్నారు. ఈ వివాహానికి విజయవాడ సమీపంలోని మురళి రిసార్ట్ వేదిక కానుందని తెలుస్తోంది. రాత్రి 7.59 నిమిషాలకు పుష్పవల్లి మెడలో వంగవీటి రాధాకృష్ణ మూడుముళ్లు వేయనున్నారు.

publive-image

మాజీ ఎమ్మెల్యే, వంగవీటి మోహన రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. అక్టోబర్ 22న  రాత్రి 7.59 నిమిషాలకు శ్రవణా నక్షత్రయుక్త వృషభ లగ్నంలో ముహూర్తం ఖాయం చేశారు. ఈ పెళ్లి వేడుక విజయవాడ – నిడమానూరు పోరంకి రోడ్డు లోని మురళి రిసార్ట్స్‌లో జరుగనుంది. ఈ మేరకు శుభలేఖలు సిద్ధమయ్యాయి. ఈ నెల 22న రాధ, పుష్పవల్లిలు వివాహ బంధంతో ఒక్కటికానున్నారు.

వంగవీటి రాధ, పుష్పవల్లిలకు గత నెల 3న నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా వివాహ ముహూర్తం ఖరారైంది.. ఈ జంట వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వివాహానికి వంగవీటి అభిమానులతో పాటు వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. కాగా, విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి 2004లో కాంగ్రెస్ పార్టీ టికెట్ తో వంగవీటి రాధాకృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాతి కాలంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీచేయగా.. ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు.

పుష్పవల్లి తల్లి జక్కం అమ్మాణి 1987-92 వరకు టీడీపీ నుంచి నరసాపురం మున్సిపాలిటీ చైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆమె తండ్రి గతంలో నరసాపురం టీడీపీలో కీలక నేతగా ఉన్నారు. మొత్తానికి ఈ నెల 22న వంగవీటి రాధ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

Also Read: బండారుపై రోజా సీరియస్ యాక్షన్.. కీలక నిర్ణయం తీసుకున్న మంత్రి

Advertisment
తాజా కథనాలు