చంద్రబాబు ఎక్కడున్నా సింహమే.!

చంద్రబాబు జైల్ లో ఉన్నా.. బయట ఉన్నా.. సింహం సింహమేనని కామెంట్స్ చేశారు టీడీపీ మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ఈ క్రమంలోనే పాదయాత్రతో లోకేష్‌కు వస్తున్న ఆదరణను చూసి అధికార పార్టీ ఓర్వలేకపోతోందన్నారు. యువగళంకు అడ్డంకులు సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు.

New Update
Anitha : వైసీపీ పాలనలో పోలీస్ స్టేషన్ల పరిస్థితి దారుణం: హోంమంత్రి అనిత

RTVతో తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైల్ లో ఉన్నా.. బయట ఉన్నా సింహాం సింహమే అని పొగిడారు. యువగళం పాదయాత్ర గతంలో మాదిరిగానే దిగ్విజయంగా ముందుకు సాగుతుందని వెల్లడించారు. లోకేష్ కి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక పోతోందన్నారు. ఆటంకం సృష్టించి పాదయాత్రను అడ్డుకువాలని చూశారని తెలిపారు.

Also Read: నా భర్త మృతిపై అనుమానాలున్నాయి.. SRO భార్య షాకింగ్ కామెంట్స్.!

టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు.. అటు తండ్రిని..ఇటు పార్టీని కష్టాల్లో రక్షించుకున్నాడని కామెంట్స్ చేశారు. అన్ని చేధించుకుని తండ్రికి తగ్గ తనయుడిగా పాదయాత్ర మొదలు పెట్టాడం శుభదాయకం అని కొనియాడారు. వాళ్లు ఎన్ని కేసులు పెట్టిన అన్ని ఎదుర్కొని మళ్ళీ యువగళం పాదయాత్ర మొదలు పెట్టగలిగారంటే లోకేష్, టీడీపీ గెలిచినట్టేనని ధీమ వ్యక్తం చేశారు. 30 సంవత్సరాల సరిపడే ఒక నాయకత్వాన్ని చంద్రబాబు మాకు లోకేష్ ని అందించారన్నారు. చంద్రబాబు నాయుడు త్వరలోనే ప్రజాసంగ్రామంలో వస్తున్నాడని..సింహం ఎక్కడున్నా సింహమేనని చంద్రబాబును కీర్తించారు.

ఈ క్రమంలోనే మార్గాని భరత్ రామ్ పై అనిత ఫైర్ అయ్యారు. అసలు అతను ఎంపీగా ఎందుకు ఉన్నాడో మాకు అర్థం కావడం లేదని విమర్శలు గుప్పించారు. రాజమండ్రిలో ఎక్కడైనా ఎదైనా శంకుస్థాపన చేయగలిగాడా ? అని ప్రశ్నించారు. ఇలాంటివారు కూడా లోకేష్ కోసం మాట్లాడటానికి సరిపోరని, పాదయాత్ర అంటే రీల్స్ చేసినంత ఈజీ కాదని కామెంట్స్ చేశారు. వైసీపీ సామాజిక సాధికారత అనేది ఎంతచేసారో బస్సుయాత్రలో జనం స్పందన చూసి చెప్పుకుంటున్నారని ఎద్దెవ చేశారు.

Advertisment
తాజా కథనాలు