AP: బాలినేనికి ఇదే నా సవాల్.. అలా చేయకపోతే రాజకీయాలకు దూరంగా ఉంటా: సుబ్బారావు గుప్తా

శ్రీకర డేవలపర్స్ పేరుతో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అరాచకాలు చేశారన్నారు టీడీపీ నేత సుబ్బారావు గుప్తా. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వందల కోట్లు అక్రమ దందా చేశారని ఆరోపించారు. బాలినేని అవినీతిని ఆధారాలతో నిరూపిస్తానని ఛాలెంజ్ చేశారు.

New Update
AP: బాలినేనికి ఇదే నా సవాల్.. అలా చేయకపోతే రాజకీయాలకు దూరంగా ఉంటా: సుబ్బారావు గుప్తా

Ongole: ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిపై టీడీపీ నేత సుబ్బారావు గుప్తా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. శ్రీకర డేవలపర్స్ పేరుతో మాజీ ఎమ్మెల్యే అరాచకాలు చేశారన్నారు. స్వార్థం కోసం కాలువలను పూడ్చారని.. కొండలను తవ్వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: అశ్వరావుపేట సర్కిల్ లో మరో ఎస్ఐ మృతి.. పోలీసులను వెంటాడుతున్న విషాదాలు..!

అధికారాన్ని అడ్డుపెట్టుకుని వందల కోట్లు అక్రమ దందా చేశారని ఆరోపించారు. ఆధారాలతో నిరూపిస్తా.. ఛాలెంజ్ కి బాలినేని, అతని వియ్యంకుడు భాస్కర్ రెడ్డి సిద్దమా అంటూ ప్రశ్నించారు. జరిగిన అవినీతి, అవకతవకలపై విజలెన్స్ విచారణ చేస్తే, అధికారులు నేరుగా జైలుకే వెళ్తానన్నారు.

Also Read: సంచలనంగా మైనర్ బాలిక హత్య.. నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్..!

నగర కార్పొరేషన్ నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేటర్లు, మేయర్ తో సహా బాలినేని అక్రమ దందాకు సహకరించారని మండిపడ్డారు. జరిగిన అవినీతి నిరూపించకపోతే తాను జీవితంలో బాలినేని పేరు ఎత్తనని.. రాజకీయాలకు దూరంగా ఉంటానని సవాల్ చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు