Allagadda: నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలో ఏవి సుబ్బారెడ్డి ఇంటి ముందు ఆందోళన నెలకొంది. టీడీపీ మహిళ నేత శ్రీదేవి (TDP Leader Sridevi) హత్య కేసులో న్యాయం కోసం బాధిత కుటుంబ సభ్యులు నిరహార దీక్ష చేపట్టారు. ఏవి సుబ్బారెడ్డిని (AV Subba Reddy) వెంటనే పార్టీ నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకూ ఈ పోరాటం ఆగదని తేల్చిచెబుతున్నారు.
Also Read: జూలై 4వ తేదీ విద్యాసంస్థల బంద్: AISF
ఏవి సుబ్బారెడ్డిని త్వరగా అరెస్ట్ చేయాలని శ్రీదేవి కొడుకు అట్లా హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. పార్టీ హై కమాండ్ స్పందించి త్వరగా తమకు న్యాయం చేయాలన్నారు. ఈరోజు మా అమ్మను చంపేశారు రేపు మమ్మల్ని కూడా చంపేస్తారని.. ఏవి సుబ్బారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
Also Read: దయనీయంగా రైతుల పరిస్థితి.. 250 మంది ఆత్మహత్య..!
కాగా, మాజీ మంత్రి, ఎమ్మెల్యే అఖిలప్రియ (Akhila Priya) అనుచరుడు టీడీపీ నేత ఏవీ భాస్కర్ రెడ్డి, ఆయన సతీమణి శ్రీదేవిపై ఈ నెల 25న దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో శ్రీదేవి చనిపోగా.. తీవ్ర గాయాలైన భాస్కర్ రెడ్డి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డితో మరో 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.