TDP Ravi Naidu: తిరుపతిలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గుడివాడ అమరనాథ్ ఏపీలో పరిశ్రమలెక్కడ అని ప్రశ్నించారు. పరిశ్రమలు కాదు కదా..రకరకాల మద్యం బ్రాండ్ లు తెచ్చారని మండిపడ్డారు. మద్యం కొత్త బ్రాండ్లతో యువత భవిష్యత్తును నాశనం చేశారని విమర్శలు గుప్పించారు. పరిశ్రమల కోసం పెట్టుబడులు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని కామెంట్స్ చేశారు.
Also Read: కర్నూలు వైసీపీ అభ్యర్థిగా IAS ఇంతియాజ్
జగన్మోహన్ రెడ్డి సాధించిన ఘనత కొత్త మద్యం బ్రాండ్లు తీసుకురావడమేనని అన్నారు. ఏపీలో రోడ్లు లేవని..నిరుద్యోగులు ఆర్తనాదాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తు అంధకారంగా మారిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు సీఎం జగన్ కు రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించాలన్నారు. సిద్థం సభలకు పాఠశాలల బస్సులు వాడుకోవడం సరైన పద్దతి కాదని సూచించారు.
Also Read: జీ న్యూస్-మ్యాట్రిజ్ సంచలన సర్వే .. ఏపీలో గెలిచేది ఎవరంటే?
విద్యావ్యవస్థను జగన్ నాశనం చేశారని దుయ్యబట్టారు. నేను మీ మేనమామ నంటూ సీఎం జగన్ పిల్లలకు భవిష్యత్త్ లేకుండా చేశారని ధ్వజమెత్తారు. ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ అన్న జగన్..ఇచ్చిన హామీ ఎక్కడంటూ ప్రశ్నించారు. ఉన్నత విద్యావంతుల్లారా..ఒక్కసారి ఆలోచించండి..వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించండని కోరారు. ఈ క్రమంలోనే మంత్రి రోజాపై చురకలు వేశారు ఫ్లవర్ రోజా..ప్రజల చెవిలో పువ్వులు పెట్టొద్దని కౌంటర్ వేశారు. మంత్రిగా చేసిన ఒక్క అభివృద్ధినైనా రోజా చూపించగలరా అని అడిగారు. షర్మిలపై మంత్రి రోజా వ్యక్తిగత విమర్శలు చేయడం సరైంది కాదని సూచించారు.