టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని (Chandrababu Naidu) ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరో వైపు నారా లోకేష్ (Nara Lokesh) కూడా అరెస్ట్ అవుతురాన్న చర్చ జోరుగా సాగుతోంది. చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుంచి లోకేష్ పార్టీ వ్యవహారాలను చూస్తున్నారు. అయితే.. లోకేష్ కూడా అరెస్ట్ అయితే పార్టీ వ్యవహారాలను ఎవరు చూస్తారన్న ప్రశ్న పార్టీ కేడర్ నుంచి వ్యక్తం అవుతోంది. అదే జరిగితే పార్టీ పగ్గాలు నారా బ్రాహ్మణి చేపట్టనున్నట్లు కూడా ప్రచారం సాగింది. అయితే.. చంద్రబాబు మాత్రం పార్టీ పగ్గాలను తనకు అత్యంత విధేయుడు, నమ్మకస్తుడు, పార్టీలో సీనియర్ అయిన యనమల రామకృష్ణుడికే (Yanamala RamaKrishnudu) అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో నిన్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, మాజీ మంత్రి నారాయణ ములాఖత్ అయ్యారు. ఆ సమయంలోచంద్రబాబు యనమల పేరును సూచించినట్లు సమాచారం. ఎన్నికలు దగ్గర పడుతుండడం, బ్రహ్మణికి రాజకీయ అనుభవం లేకపోవడంతోనే ఆమెకు నాయకత్వం అప్పగించే విషయంలో చంద్రబాబు వెనకడుగు వేసినట్లు సమాచారం.
ఇంకా యనమల రామకృష్ణుడి విషయానికి వస్తే.. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబుకు అధికార మార్పిడి జరిగిన సమయంలో స్పీకర్ గా కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అత్యంత నమ్మకస్తుడిగా యనమలకు పేరుంది. పార్టీ, తర్వాత ఏర్పడిన టీడీపీ ప్రభుత్వాల్లోనూ యనమలకు కీలక స్థానం కల్పించారు చంద్రబాబు. గత ప్రభుత్వంలోనూ ఆయనకు ఆర్థిక మంత్రిగా కీలక పదవి దక్కింది.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: అక్టోబర్ 1 నుంచి 4వ విడత వారాహి యాత్ర