Chandrababu: మాజీ సీఎం అరెస్ట్ కు నిరసనగా వాళ్లు ఏం చేశారంటే..?

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ వ్యాప్తంగా ఆందోళన పరిస్థితి కొనసాగుతునే ఉంది. చంద్రబాబును విడుదల చేయాలని డిమాడ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా మేము సైతం అంటూ రిలే నిరాహారదీక్ష కార్యక్రమం చేపట్టారు టీడీపీ పార్టీ శ్రేణులు. చంద్రబాబు త్వరగా జైలు నుండి విడుదల కావాలని గుడిలో ప్రత్యేక పూజలు చేయిస్తున్నారు. 16 నెలలు జైల్లో వున్న జగన్ తన శాడిజంతో చంద్రబాబును జైలుకు పంపారని మండిపడుతున్నారు.

New Update
Chandrababu: మాజీ సీఎం అరెస్ట్ కు నిరసనగా వాళ్లు ఏం చేశారంటే..?

TDP Protest: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మేము సైతం అంటూ రిలే నిరాహారదీక్ష కార్యక్రమం చేపట్టారు టీడీపీ పార్టీ శ్రేణులు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని అధికార పార్టీ వైసీపీని దుమ్మెత్తిపోస్తున్నారు. ఆయన త్వరగా జైలు నుండి విడుదల కావాలని ప్రత్యేక పూజలు చేయిస్తున్నారు టీడీపీ నేతలు. 16 నెలలు జైల్లో వున్న జగన్ తన శాడిజంతో చంద్రబాబును జైలుకు పంపారని మండిపడుతున్నారు.

టీడీపీ, జనసేన పొత్తుల ప్రక‌ట‌న త‌ర్వాత సీఎం జగన్‌కు, వైసీపీ మంత్రుల‌కు భ‌యం ప‌ట్టుకుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎద్దెవ చేశారు.ప‌వ‌న్ పొత్తుల ప్రకట‌న త‌ర్వాత వైసీపీ నేత‌లు నిద్రలేని రాత్రులు గ‌డుపుతున్నారని చురకలు వేశారు. టీడీపీ నేత వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో గుడివాడలో నాలుగో రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షా శిబిరానికి మద్దతుగా మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు పాల్గొన్నారు. నియంతలుగా వ్యవహరించిన నేతలు చరిత్రలో కలిసిపోయారని..జగన్ కు కూడా అదే గతి పడుతుందని కొనకళ్ళ నారాయణరావు దూషించారు. జగన్ అరాచకాలకు ముగింపు పలికేందుకు పవన్ కళ్యాణ్ నాంది పలికారన్నారు వేనిగండ్ల రాము. దుర్మార్గపు పాలను చేస్తూ ప్రజా వేదికలపై శ్రీరంగనీతులు వల్లిస్తున్న జగన్ కు రోజులు దగ్గర పడ్డాయని తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు.

కృష్ణా జిల్లా ఉయ్యూరులో జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో మంటాడలోని భూదేవి సమేత కళ్యాణ వెంకటరమణ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 108 కొబ్బరికాయలు కొట్టారు. చంద్రబాబు అరోగ్యంగా ఉండాలని త్వరగా బెయిల్ రావాలని కోరుకుంటూ జనసైనికులు, టీడీపీ కార్యకర్తలు మొక్కులు తీర్చుకున్నారు.

చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ఎన్టీఆర్ జిల్లా తక్కెళ్ళపాడులో టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ అరాచక పాలనను అంతమొందించే వరకు ఇటువంటి కేసులకు భయపడేది లేదని పెర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి అధికారులు ప్రస్తుతం కూడా పనిచేస్తున్నారని..అవినీతి జరిగిందని వారిని సాక్షాదారాలతో నిరుపించండి అంటూ గుంటూరులో టీడీపీ రాష్ట కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్ వాపోయారు. టీడీపీ జనసేన కలిసి పోరాడుతే నిజంగా కురుక్షేత్ర సంగ్రామమే జరుగుతుందన్నారు. మీరు కౌరవులు కాబట్టి ఓటమి తప్పదంటూ వైసీపీపై సెటైర్లు వేశారు.

అనకాపల్లి జిల్లా కోటవురట్లలో రిలే నిరాహారదీక్ష కార్యక్రమం చేపట్టారు. తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితతో పాటు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గున్నారు. విశాఖలో వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.చంద్రబాబు నాయుడు జైలు నుంచి నిర్ధోషి గా బయటపడాలని మొక్కులు చెల్లించారు. ఆర్ధిక నేరగాడు ముఖ్యమంత్రి అయితే ఎలా వుంటుందో చూస్తూనే వున్నామని వ్యాఖ్యనించారు.

అనకాపల్లి జిల్లాలో మాజీ టిడిపి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కసింకోట వెంకటేశ్వర స్వామి గుడిలో 108 కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు విడుదల కాగానే తిరుమల కొండకు కాళీ నడకతో వస్తానని పీలా మొక్కుకున్నారు. పశ్చిమగోదావరి భీమవరంలోనూ గునుపూడి పంచారామ క్షేత్రం ఉమా సోమేశ్వర జనార్ధన స్వామివార్ల ఆలయంలో చండీ హోమం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు పేరు మీద చండీ హోమం నిర్వహించామని తెలిపారు టీడీపీ శ్రేణులు.

Also Read: ORR పై టెన్షన్‌..టెన్షన్‌..ఐటీ ఉద్యోగుల కార్‌ ర్యాలీకి నో పర్మిషన్‌..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు