Narayana: ఒక్కఛాన్స్ అని రాష్ట్రాన్ని శూన్యంలోకి నెట్టేశారు: నారాయణ ఒక్కఛాన్స్ అని అబద్దాలు చెప్పి అధికారం చేపట్టిన వైసీపీ సర్కార్ ఆంధ్రరాష్ట్రాన్ని శూన్యంలోకి నెట్టేసిందని మాజీ మంత్రి పొంగూరు నారాయణ మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు తధ్యం అని ధీమ వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 11 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి TDP Narayana: ఒక్కఛాన్స్ అని అబద్దాలు చెప్పి అధికారం చేపట్టిన వైసీపీ సర్కార్ ఆంధ్రరాష్ట్రాన్ని శూన్యంలోకి నెట్టేసిందని మాజీ మంత్రి పొంగూరు నారాయణ మండిపడ్డారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 49వ డివిజన్ ఈద్గా మిట్టలో బాబు ష్యూరిటీ - భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడిన నారాయణ... వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై ఆరా తీశారు. వైసీపీ అరాచకపాలనకు స్వస్తి పలికేలా రానున్న 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. Also Read: నాదెండ్ల మనోహర్ అరెస్ట్.. పవన్ సీరియస్ వార్నింగ్..! ఈ సందర్భంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ బాబు ష్యూరిటీ - భవిష్యత్‌కు గ్యారెంటీ ద్వారా ప్రజల్లోకి తాము వెళుతుంటే వారి నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనతో విసిగివేశారిన ప్రజలు..టీడీపీ పాలనలో చేసిన అభివృద్ధి ఏమిటో వారే తమకు గుర్తు చేస్తున్నారని చెప్పారు. టీడీపీ చేసిన అభివృద్ధి ఏమిటో., ఒక్క ఛాన్స్ పేరుతో అధికారం దక్కించుకుని ప్రజలను ఇబ్బంది పెడుతున్న వైసీపీ చేస్తున్న ఘన కార్యమేమిటో ప్రజలు తమకు వివరిస్తున్నారని తెలిపారు. వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని తెలిపిన నారాయణ... టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పరిపాలన సాగించామని చెప్పారు. నెల్లూరు నగరంలో కోట్ల రూపాయలు వెచ్చించి అండర్‌గ్రౌండ్ డ్రైనేజి పనులను 90 శాతం పూర్తి చేస్తే.. కేవలం 10 శాతం పనులను చేయించలేక వైసీపీ సర్కార్ చతికిలపడిందని ఎద్దేవా చేశారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని ఓ ప్రణాళికాబద్ధంగా నెల్లూరును అభివృద్ధి చేసేందుకు టీడీపీ పాలనలో శ్రీకారం చుట్టామని చెప్పారు. అందులో భాగంగానే సంగం బ్యారేజి నుంచి తాగునీటి పథకం, ఏసీ బస్‌షెల్టర్లు, పార్కుల ఆధునీకరణతో పాటు ఎన్నో ప్రజోపకర పనులు చేపట్టామని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో కేవలం కొట్లాట, బెదిరింపులు, కేసులు, స్టేషన్లు అంటూ అరాచకపాలన సాగిస్తుందని, ఇది మంచి పద్దతి కాదని మాజీ మంత్రి పొంగూరు నారాయణ హితవు పలికారు. 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపు తధ్యం అని ధీమ వ్యక్తం చేశారు. #andhra-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి