'కేశినేని కౌన్ కిస్కా గొట్టం, క్యారెక్టర్ లెస్, ఊసరవెల్లి' ఇందుకోసమే నానికి టిక్కెట్ ఇచ్చారు.. కేశినేని నాని అవినీతి పరుడని నిరూపించడానికి మేం సిద్దం అంటున్నారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న. కేశినేని నాని ఓ బచ్చా, కౌన్ కిస్కా గొట్టం, ఓ ఛీటర్, క్యారెక్టర్ లెస్, ఊసరవెల్లి అంటూ నిప్పులు చెరిగారు. By Jyoshna Sappogula 12 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి TDP MLC Buddha Venkanna: కేశినేని నాని అవినీతి పరుడని నిరూపించడానికి మేం సిద్దం అంటున్నారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న. కేశినేని నాని బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పెంత..? తిరిగి చెల్లించింది ఎంత..? తాను తీసుకున్న బ్యాంకుల అప్పుల వివరాలు కేశినేని నాని వెల్లడించగలరా..? అంటూ ప్రశ్నించారు. కేశినేని నాని కబ్జాలు చేశారని అందుకే నానికి భయం మొదలైందని వ్యాఖ్యనించారు. తన ఆస్తులు ఎనికేపాడులో ఉన్నాయని.. కాబట్టే.. గన్నవరం నుంచి నాగార్జున సాగర్ మధ్యలో రాజధాని ఏర్పాటు చేయమని చెప్పాడన్నారు. తంతారనే భయంతోనే.. టీడీపీలో ఉండగా ఇన్ఛార్జీలను పక్కన పెట్టుకునే వాడు కాదు..కానీ, ఇవాళ తాను పాల్గొన్న కార్యక్రమంలో దేవినేని అవినాష్ ను పక్కన పెట్టుకున్నారని తెలిపారు. అవినాష్ పక్కన లేకుంటే తంతారని ఆయనకి భయం పట్టుకుందన్నారు. సూర్యకాంతం పేరు ఆడపిల్లలకు పెట్టడానికి భయపడతారు.. నాని పేరు మగపిల్లలకు పెట్టడానికి భయపడుతున్నారని ఎద్దెవ చేశారు. తాడేపల్లి ప్యాలెస్సుకు వెళ్లి వీరంగం వేస్తే కొడతారని హెచ్చరించారు. కేశినేని నాని ఓ ఛీటర్, క్యారెక్టర్ లెస్, ఊసరవెల్లి అంటూ ధ్వజమెత్తారు. Also Read: ‘ కాపు, బలిజలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు’.. ఓవి.రమణ కీలక వ్యాఖ్యలు ఇందుకే నానికి టికెట్.. 2009 నుంచి 2024 మధ్య కాలంలో కేశినేని నాని మూడు పార్టీలు మారారని..గతంలో లగడపాటికి కేశినేని నాని ఫోన్ చేసి.. వాళ్ల పార్టీలో చేరుతానన్నారు. అయితే, వద్దులే అంటూ కేశినేని నానిని లగడపాటి తిరస్కరించారని చెప్పుకొచ్చారు. వారం రోజుల ముందు జగన్ పని అయిపోయిందన్న కేశినేని నానికి వైసీపీ ఎంపీ సీటు ఇచ్చిందని..వైసీపీ పని అయిపోవడం వల్లే కేశినేని నాని వంటి వారికి జగన్ టిక్కెట్ ఇచ్చారని పేర్కొన్నారు. కేశినేని నాని శాడిస్టు ముదిరి సైకోలా మారారన్నారు. కేశినేని నాని కొవ్వు బలిసి కొట్టుకుంటున్నాడన్నారు. కండువా కప్పుకోకుండానే చంద్రబాబు లోకేష్ లను అబ్బా కొడుకులంటావా..? కేశినేని నానిని.. ఆయన కూతురును మేం అనగలం.. కానీ సంస్కారం అడ్డొస్తుందన్నారు. కేశినేని నాని ఓ బచ్చా..కేశినేని నాని కౌన్ కిస్కా గొట్టం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడను అభివృద్ధి చేసింది చంద్రబాబు.. నువ్వు చేశావా..? కేశినేని నాని నువ్వెంత.. ? నీ బతుకెంత..? అంటూ నిప్పులు చెరిగారు. జగన్ ను చెల్లి ఛీ కొట్టింది.. నానిని చిన్ని ఛీ కొట్టాడన్నారు. కండువా కప్పుకోకుండానే కేశినేని నానికి సీటిచ్చారంటేనే ఆ పార్టీ పరిస్థితేంటో అర్థం అవుతోందన్నారు. కేశినేని నానిని తిరస్కరించిన కార్యకర్తలకు సెల్యూట్ అంటూ ప్రశంసించారు. జగన్ దగ్గరకు వెళ్లినప్పటి నుంచే కేశినేని నానికి కౌంట్ డౌన్ మొదలైందని వ్యాఖ్యనించారు. #kesineni-nani #tdp-mlc-buddha-venkanna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి