Payyavula Keshav: జగన్‌ ఎన్ని సీట్లు గెలుస్తారంటే..!?

ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అంటూ జగన్(Jagan) ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్(Payyavula Keshav) ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం ఏ ప్రూఫ్‌ లేకుండానే చంద్రబాబు(Chandrababu) ను అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు ఉన్న పొలిటికల్ ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేయాలనే ఉద్ధేశ్యంతోనే జగన్ ఈ కుట్రలు చేస్తున్నారన్నారు. ప్రశ్నించిన వారందర్నీ ఇలాగే అరెస్ట్ చేసుకుంటూ వెళ్తే..వచ్చే ఎన్నికల్లో వైసీపీకి కేవలం రెండు సీట్లే వస్తాయని పయ్యావుల కేశవ్ హెచ్చరించారు.

New Update
Payyavula Keshav: జగన్‌ ఎన్ని సీట్లు గెలుస్తారంటే..!?

Payyavula Keshav: ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అంటూ జగన్ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం ఏ ప్రూఫ్‌ లేకుండానే చంద్రబాబు(Chandrababu) ను అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు.  కేవలం చంద్రబాబుకు ఉన్న పొలిటికల్ ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేయాలనే ఉద్ధేశ్యంతోనే జగన్ ఈ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించిన వారందర్నీ ఇలాగే అరెస్ట్ చేసుకుంటూ వెళ్తే..వచ్చే ఎన్నికల్లో వైసీపీకి కేవలం రెండు సీట్లే వస్తాయని పయ్యావుల కేశవ్ హెచ్చరించారు.

స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో చంద్రబాబు అరెస్ట్‌పై పయ్యావుల కేశవ్ స్పందించారు. వైసీపీ చేసే కుట్రలకు,ఇలాంటి అక్రమ కేసులకు చంద్రబాబు, టీడీపీ భయపడదని, రాజకీయంగానే ఎదుర్కొంటామన్నారు. సీమెన్స్ సంస్థ అద్భుతమైన పనితీరును కనబరిచిందని 2021లోనే వైసీపీ ప్రభుత్వం ప్రశంసించిందని, ఇంకోవైపు ఒప్పందం ప్రకారం సాఫ్టువేర్, హార్డ్‌వేర్ అన్ని అందాయని చెబుతున్నారని, మరోవైపు నిధులు పక్కదారి పట్టాయని చెబుతూ.. వాటిని ఇప్పటి వరకు నిరూపించలేకపోయారన్నారు. చంద్రబాబుకు అవినీతి మరక అంటించాలనేది జగన్ కుట్ర అన్నారు. అసలు సీమెన్స్ సంస్థను కోర్టు పరిధిలోకి ఎందుకు తీసుకు రావడం లేదని ప్రశ్నించారు.

ప్రభుత్వం, సీమెన్స్ సంస్థ, డిజైన్‌టెక్ ఒప్పందం చేసుకున్నాయని, కానీ సీమెన్స్‌ సంస్ధ చంద్రబాబు నేరం చేశాడని ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఆ సంస్థను ప్రతివాదిగా ఎందుకు చేర్చలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం ఒక్కరూపాయి అయినా పక్కదారి పట్టించిందని నిరూపించారా? అని ప్రశ్నించారు. ఈ నాలుగేళ్లలో ఏ ఒక్కరోజు నోటీసు ఇవ్వలేదన్నారు. ప్రజావ్యతిరేకతను దృష్టి మళ్లించేందుకే జగన్ ఇలా అర్ధం లేని పనులు చేస్తున్నారని దుయ్యబట్టారు.

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ఆందోళనలను చేస్తున్నారు. తప్పుడు కేసులో చంద్రబాబును ఇరికించి రిమాండ్‌కు పంపారని వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. జగన్ పాలనపై  విమర్శలు చేస్తూ నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. సీఎం డౌన్ డౌన్ అంటూ పలుచోట్ల ధర్నాలు చేస్తున్నారు. అయితే,వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన వచ్చే ఎన్నికల్లో గెలుపు విజయం తధ్యం అంటున్నారు టీడీపీ నేతలు

Also Read: చంద్రబాబు ఇండియా కూటమిలో చేరుతారా..? బీజేపీని ఢీ కొడతారా..?

Advertisment
Advertisment
తాజా కథనాలు