వారికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు..తేల్చి చెప్పిన నిమ్మల రామానాయుడు.!

టిడ్కో లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. నియోజకవర్గంలో ఇంటి స్థలాలు సేకరణ పేరుతో వైసీపీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు.

New Update
Minister Nimmala : సోమశిల జలాశయం ప్రమాదంలో ఉంది : మంత్రి నిమ్మల

Nimmala Ramanaidu: పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. నాలుగున్నర ఏళ్ల కాలంలో టిడ్కో గృహాల అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఇంటి స్థలాలు సేకరణ పేరుతో వైసీపీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. తాము కార్యక్రమం పెట్టుకున్న రోజే వైసిపి నాయకులు అదే ప్రాంతంలో కార్యక్రమం ఎలా పెడతారంటూ మండిపడ్డారు. నిరసనలు చేస్తే అరెస్ట్ చేస్తారా అంటూ ధ్వజమెత్తారు.  టిడ్కో లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. వైసీపీ అంటేనే దొంగల, దోపిడీల రాజ్యం అని దుయ్యబట్టారు.

కాగా, నిన్న పాలకొల్లు టిడ్కో గృహాల వేదికగా రాజకీయం వేడెక్కింది. టిడిపి, వైసిపి(TDP-YCP) నాయకులు ఒకే రోజు టిడ్కో గృహాల వద్ద నిరసన కార్యక్రమంకు పిలుపునిచ్చారు. వైసిపి హయంలో టిడ్కో లబ్ధిదారులకు అన్యాయం జరిగిందంటూ ‘పాలకొల్లు చూడు’ కార్యక్రమంకు పిలుపునిచ్చారు టిడిపి నేతలు. టిడ్కో గృహాల వద్ద వంటావార్పు కార్యక్రమం చేసేందుకు ప్రయత్నించారు. మరోవైపు, టిడిపి హయాంలో టిడ్కోలో భారీ అవినీతి జరిగిందంటూ నిజం చెబుతాం అనే నిరసన కార్యక్రమంను చేపట్టారు వైసీపీ నేతలు. అయితే, ఈ కార్యక్రమంకు అనుమతి లేదంటూ పోలీసులు టిడిపి ఎమ్మెల్యే రామానాయుడును నిన్న అరెస్ట్ చేశారు.

Also read: అందుకే.. జగన్ వై నాట్ 175 అని అంటున్నారు: బోండా ఉమా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు