/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Rushikonda-1.jpg)
రుషికొండను టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుషికొండను గత ప్రభుత్వం విధ్వంసం చేసి రహస్యంగా రాజమహల్ నిర్మించిందని ఆరోపించారు. రుషికొండ రాజమహల్‌కు ఎలాంటి అనుమతులు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అత్యంత గోప్యంగా నిర్మాణాలు ఎందుకో అర్థం కాలేదన్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ అని చెప్పే ధైర్యం కూడా గత ప్రభుత్వానికి లేకుండా పోయిందన్నారు. రూ.500కోట్లతో రుషికొండలో నిర్మాణాలు చేపట్టారన్నారు. త్వరలో సీఎం చంద్రబాబు విశాఖలో పర్యటించనున్నట్లు చెప్పారు. ఆ సమయంలోనే సీఎం రుషికొండ నిర్మాణాలపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.