Araku TDP MLA candidate Donna Dora: తాను పార్టీ మారిపోతున్నట్టు వచ్చిన ప్రచారాన్ని ఖండించారు అరుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర దేశం పార్టీ గిరిజన విభాగము అధ్యక్షుడు సివ్వేరి దొన్ను దొర. తనకు పెరుగుతున్న జనాదరణ చూసి ఓర్వలేకే తమ పార్టీలోని కొందరు వ్యక్తులు, ఇతర పార్టీల వారు పనికట్టుకుని ఇలా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Also read: ఎవరికీ పట్టని ఎదురు మొండి దీవుల ప్రజల గోడు.!
తాను పార్టీ మారిన తర్వాత వైసిపి అనేక పదవులు ఆశ చూపిందని ఐనప్పటికీ తాను ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తాను వైసిపి వీడిన కారణాన్ని.. తెలుగుదేశంలో స్థిరంగా ఉండి చేస్తున్న చేపడుతున్న కార్యక్రమాలను ఆయన వివరించారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ వైసీపీ పై త్రీవ స్ధాయిలో విమర్శలు గుప్పించారు.
Also read: నందిగామ వైసిపిలో భగ్గుమన్న వర్గ పోరు..!
వైసిపి గిరిజన హక్కులను భ్రష్టు పట్టించిందని ధ్వజమెత్తారు. గిరిజనులకు చెందిన 13 రకాల ప్రయోజనాలను దెబ్బతీసిందనీ.. కనుకనే వైసీపీ పార్టీకి ఈ ప్రాంతంలో భవిష్యత్తు లేదని అన్నారు. అధికార పార్టీ విధానాలను ఎప్పటికప్పుడు ఎండబెడుతున్నామనీ వెల్లడించారు. తెలుగుదేశం తోనే రాష్ట్రానికీ, గిరిజన ప్రాంతానికి బంగారు భవిష్యత్తు ఉందని భరోసా కల్పించారు. రాబోయేది తమ ప్రభుత్వమేనని దొన్నుదొర ధీమ వ్యక్తం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు ఎవరైనా చెప్పినా నమ్మవద్దని..పార్టీ మారే ప్రశస్తే లేదని తేల్చి చెప్పారు.