AP Assembly: గందరగోళంగా ఏపీ అసెంబ్లీ.. ఉభయ సభల్లో టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉభయసభలు ఎన్నిసార్లు వాయిదా వేసినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా.. ఉభయ సభల్లో టీడీపీ సభ్యులు ఆందోళన చేపడుతున్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు ఎత్తివేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ గందరగోళం నేపథ్యంలో సభను వాయిదా వేసి మళ్లీ మొదలు పెట్టినా టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కంటిన్యూ చేస్తూ వచ్చారు.

AP Assembly: గందరగోళంగా ఏపీ అసెంబ్లీ.. ఉభయ సభల్లో టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు..
New Update

Andhra Pradesh Assembly Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉభయసభలు ఎన్నిసార్లు వాయిదా వేసినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. చంద్రబాబు(Chandrababu) అరెస్ట్‌కు నిరసనగా.. ఉభయ సభల్లో టీడీపీ(TDP) సభ్యులు ఆందోళన చేపడుతున్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు ఎత్తివేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ గందరగోళం నేపథ్యంలో సభను వాయిదా వేసి మళ్లీ మొదలు పెట్టినా టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కంటిన్యూ చేస్తూ వచ్చారు. దాంతో ఒకానొక దశలో స్పీకర్ మార్షల్స్‌ని సభలోకి పిలిపించారు. స్పీకర్ పోడియం చుట్టూ వారిని సెక్యూరిటీగా పెట్టుకున్నారు. అయితే, టీడీపీ సభ్యులు మార్షల్స్‌ని తోసుకుని స్పీకర్ పోడియం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో అలర్ట్ అయిన మార్షల్స్.. వారిని అడ్డుకున్నారు. సభలో విజిల్స్ వేస్తూ రచ్చ రచ్చ చేశారు.

వీడియో తీసిన టీడీపీ నేతలు..

కాగా, సభలో టీడీపీ సభ్యుల ఆందోళనను అచ్చెన్నాయుడు, బెందాలం అశోక్ వీడియో తీశారు. ఆ వీడియో ఇద్దరు సభ్యులు సస్పెండ్ చేయాలంటూ చీఫ్ విప్ ప్రసాద రాజు ప్రతిపాదించారు. దాంతో అచ్చెన్నాయుడు, బెందాలం అశోక్‌లను సమావేశాలు పూర్తికాలం సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారం. మరోవైపు టీడీపీ సభ్యులు తమ సీట్లలో పైకిక్కి నిరసన వ్యక్తం చేశారు. సభలో విజిల్స్ వేస్తూ రచ్చ చేశారు. బాలకృష్ణతో పాటు.. ఇతర టీడీపీ సభ్యులు సీట్ల పైకి ఎక్కి విజిల్స్ వేశారు. అయితే, సీఎం జగన్ సభలోకి వచ్చిన తరువాత టీడీపీ సభ్యులపై ఎదురుదాడికి దిగారు వైసీపీ సభ్యులు. ఇక సభలో విజిల్స్ వేసిన నిమ్మల రామానాయుడు, వెలగపూడి రామకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఒక్కరోజు సస్పెండ్ చేశారు స్పీకర్.

సభ నుంచి టీడీపీ వాకౌట్..

సభలో నిరసన తెలుపుతున్న తమ సభ్యులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్ చేసింది. మరోవైపు శాసన మండలిలో ముగ్గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు చైర్మన్. కంచర్ల శ్రీకాంత్‌ను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తూ తీర్మానం చేశారు. బిటి నాయుడు, పంచుమర్తి అనురాధను ఒక రోజు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మండలిలో టీడీపీ సభ్యులు విజిల్స్ ఊదగా.. వారిపై చర్యలు తీసుకోవాలంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ తీర్మానం పెట్టారు. దాంతో చైర్మన్ వారిపై చర్యలు తీసుకున్నారు.

Also Read:

Telangana: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇంటి స్థలాలు.. మరో పది రోజుల్లో పంపిణీ..

Andhra Pradesh: చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై నేడు తీర్పు.. ఏసీబీ కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ..

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe