దొంగ ఓట్లతో మాఫియా చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే .!

తిరుపతి రూరల్ పరిధిలోనే అత్యధికంగా దొంగ ఓట్లు నమోదు అయ్యాయని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు టిడిపి నాయకులు. దొంగ ఓట్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి దొంగ ఓట్ల మాఫియాతో గెలవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
దొంగ ఓట్లతో మాఫియా చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే .!

Tirupathi: తిరుపతిలో చంద్రగిరి టిడిపి ఇంఛార్జి పులిపర్తి నాని ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రగిరిలో 70,000 దొంగ ఓట్లు ఉన్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే, అధికారులు ఏ మాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఒక్క ఓటు కూడా తొలగించలేదని మండిపడ్డారు. చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒత్తిడితోనే దొంగ ఓట్లు తొలగించడం లేదని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి దొంగ ఓట్ల మాఫియాతో గెలవాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. తిరుపతి రూరల్ పరిధిలోనే అత్యధికంగా దొంగ ఓట్లు నమోదు అయ్యాయని వ్యాఖ్యనించారు.

Also read: రెండో భార్య సాక్షిగా మూడో పెళ్లి చేసుకున్న మాజీ ఎమ్మెల్యే

టిడిపి జిల్లా అధ్యక్షుడు జి.నరసింహయాదవ్ మాట్లాడుతూ..తిరుపతి జిల్లాలో 1,55,000 దొంగ ఓట్లు ఉన్నాయన్నారు. దొంగ ఓట్లు తొలగించాలని అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. అధికారులపై వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారని కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగానే మాజీ ఎమ్మెల్యే ఎం.సుగుణమ్మ మాట్లాడుతూ..తిరుపతిలో 30,000 దొంగ ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు. నివాసం లేని ఇళ్లలో విచ్చలవిడిగా దొంగ ఓట్లు నమోదు చేశారని వైసీపీ నాయకులపై ఫైర్ అయ్యారు. తిరుపతి జిల్లా కలెక్టర్ కు దొంగ ఓట్లపై ఫిర్యాదు చేశారు టిడిపి నేతలు. దొంగ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందించారు.

Also Read: పోలీసు స్టేషన్ ముందే హిటాచి యజమాని ఆత్మహత్యాయత్నం.!

Advertisment
తాజా కథనాలు