Chandrababu Health: చంద్రబాబుకు స్టెరాయిడ్స్.. డాక్టర్లను బెదిరించి తప్పుడు రిపోర్టులు.. టీడీపీ నేతల సంచలన ఆరోపణలు

ప్రభుత్వం నియమించిన వైద్యులను బెదిరించి తప్పుడు రిపోర్ట్స్ ఇస్తున్నారని టీడీపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం వారి మెడ మీద కత్తి పెట్టి తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చేలా చేస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు ను ఎయిమ్స్ లో లేదా ప్రవేట్ హాస్పిటల్ లో వైద్యం చేయించాలని డిమాండ్ చేశారు.

New Update
Chandrababu Health: చంద్రబాబుకు స్టెరాయిడ్స్.. డాక్టర్లను బెదిరించి తప్పుడు రిపోర్టులు.. టీడీపీ నేతల సంచలన ఆరోపణలు

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి (Chandrababu Health Condition) ఆందోళన కరంగా ఉందని టీడీపీ నేతలు తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యం సరిగా లేదన్న వార్తల నేపథ్యంలో టీడీపీ నేతలు ఈ రోజు నిర్వహించిన అత్యవసర సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) మాట్లాడుతూ.. ఒక్క నెలలో చంద్రబాబు 5 కేజీల బరువు తగ్గారన్నారు. అలా ఒక్కసారిగా బరువు తగ్గితే దాని ప్రభావం శరీరంలోని మిగతా అవయవాలపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిగత వైద్యులను అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం నియమించిన వైద్యులను బెదిరించి తప్పుడు రిపోర్ట్స్ ఇస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం వారి మెడ మీద కత్తి పెట్టి తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చేలా చేస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు ను ఎయిమ్స్ లో లేదా ప్రవేట్ హాస్పిటల్ లో వైద్యం చేయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు స్టెరాయిడ్స్ ఇవ్వాలని చూస్తున్నారని ఆరోపించారు. జైల్లో చంద్రబాబుకు ప్రాణహాని ఉందని మరో సారి సంచలన ఆరోపణలు చేశారు అచ్చెన్నాయుడు.
ఇది కూడా చదవండి: Chandrababu Health : డేంజర్ లో చంద్రబాబు హెల్త్.. స్టెరాయిడ్స్ ఇచ్చేందుకు కుట్ర..లోకేష్, భువనేశ్వరి సంచలన ప్రకటనలు..!!

చంద్రబాబుకు ఏదయినా జరిగితే దానికి కర్త, కర్మ, క్రియ జగన్ మెహన్ రెడ్డే అవుతారని హెచ్చరించారు. జైల్లో చంద్రబాబుపై కుట్ర జరుగుతోందనే అనుమానం కలుగుతోందన్నారు టీడీపీ నేతలు. ఈ రోజు టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశానికి టీడీపీ ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో చంద్రబాబు ఆరోగ్యంతో పాటు చంద్రబాబు కేసులు, కోర్టులో పరిణామాలు, రాజకీయ పరిస్థితులపై చర్చించారు. భవిష్యత కార్యాచరణ ఎలా ఉండాలన్న అంశంపై సైతం వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు