/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/tdp-nirasana-1-jpg.webp)
Tdp Leaders Protest: చంద్రబాబు అరెస్ట్‌తో ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుతోంది. రాష్ట్రంలో రోడ్డెక్కారు తెలుగు దేశం పార్టీ నేతలు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆందోళన చేపట్టారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ధర్నాకు దిగారు. పలుచోట్లు బంద్ ప్రకటించారు.
విజయవాడ- చెన్నై జాతీయ రహదారిపై తెలుగు యువత ధర్నా చేపట్టింది.టైర్లుకు నిప్పంటించి నిరసన చేపట్టారు టీడీపీ యువకులు. అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోనూ ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు అరెస్టుతో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే ఆనందరావును పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఆందోళనను అడ్డుకోవడంతో పోలీసులకు నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది.
భగ్గుమంటున్న టీడీపీ:
ఎన్టీఆర్ జిల్లా నందిగామ Y జంక్షన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మంత్రి జోగి రమేష్‌కు చెందిన వాహనాన్ని నందిగామలో టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. అయితే వాహనంలో మంత్రి జోగి రమేష్ కాకుండా ఆయన అనుచరులు వాహనంలో ఉన్నట్లు తెలుస్తోంది.డౌన్ డౌన్ జోగి రమేష్ అంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు. మంత్రి అనుచరులు వేలు చూపిస్తూ తమను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపిస్తున్నారు టీడీపీ శ్రేణులు.
చంద్రబాబు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ నందిగామ వద్ద విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి దిగ్బంధం చేశారు. భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు... ఇబ్బందులు పడుతున్నారు.చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేపట్టారు.
టీడీపీ అధినేత అరెస్టుకు నిరసనగా గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో జాతీయ రహదారి దిగ్బంధం చేసి టైర్లు దహనం చేసి నిరసన వ్యక్తం చేసారు.రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్, ఐటీడీపి రాష్త్ర ఉపాధ్యక్షులు పంచుమర్తి శేషు, గుంటూరు అర్బన్ టీడీపి కార్యదర్శి నిస్సంకర అమర్నాద్, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు గుత్తికొండ కిరణ్ యాదవ్ ,జిల్లా తెలుగు యువత ప్రచార కార్యదర్శి చెరుకుపల్లి నాగరాజు,తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసనలో పాల్గున్నారు.
Also Read: చంద్రబాబు అరెస్టుపై జనసేనాని ఫైర్