TDP: జవహర్ వద్దు - టీడీపీ ముద్దు.. బయటపడ్డ వర్గ విభేదాలు..! తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమైయ్యాయి. మాజీ మంత్రి జవహర్ తీరుకు వ్యతిరేకంగా కొవ్వూరులో టీడీపీ నాయకులు ఆత్మీయ సమావేశం అయ్యారు. జవహర్ వద్దు - టీడీపీ ముద్దు అంటూ నినాదాలు చేశారు. By Jyoshna Sappogula 02 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి East Godavari: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ వర్గ విభేదాలు మరో మారు బహిర్గతమైయ్యాయి. మాజీ మంత్రి జవహర్ తీరుకు వ్యతిరేకంగా కొవ్వూరులో టీడీపీ నాయకులు ఆత్మీయ సమావేశం అయ్యారు. జవహర్ వద్దు - టీడీపీ ముద్దు అంటూ నినాదాలు చేశారు. మాజీ మంత్రి జవహర్ కొవ్వూరు అభ్యర్థిగా పరిగణలోకి తీసుకోవద్దని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. Also Read: శింగనమల నియోజకవర్గంలో రగులుతున్న వర్గపోరు జవహర్ వ్యవహార శైలి పరిగణలోకి తీసుకొని కొవ్వూరు నియోజకవర్గంలో అధిష్టానం టూ మెన్ కమిటీ ఏర్పాటు చేసింది. 2014 నుండి సీనియర్ నాయకులగా ఉన్న జవహర్ కార్యకర్తలను పక్కన పెట్టీ వర్గ విభేదాలు నెలకొల్పారంటూ టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో జవహర్ తీరును ఖండిస్తున్నారు . రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్ష పదవి చేపట్టాక తన అనునాయులకు పదవులు కట్టబెట్టారంటూ నిరసన తెలిపారు. Also Read: స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ నియోజకవర్గ నాయకులు పలుమార్లు హెచ్చరించిన జవహర్ తీరు మార్చుకొవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలలో స్థానిక నాయకులకు సంబంధం లేకుండా ఫ్లెక్సీలు కట్టి వర్గ విభేదాలు సృష్టిస్తున్నారంటూ ధ్వజం ఎత్తారు. జవహర్ కు ఎట్టి పరిస్థితిలోనూ టికెట్ ఇవ్వద్దని డిమాండ్ చేస్తున్నారు. అయితే, వీరి ఆందోళనపై అధిష్టానం ఏ రకంగా స్పందిస్తుందో వేచి చూడాలి. #andhra-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి