సీఎం జగన్‌కు ఓటమి భయం పట్టుకుంది.. అందుకే అరాచకాలు

సీఎం జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే రాష్ట్రంలో అలజడులు సృష్టించే కుట్రలు చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శించారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వినుకొండ టీడీపీ బాధితులను ఆ పార్టీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, జూలకంటి బ్రహ్మరెడ్డి, జీవీ ఆంజనేయులు, ఆలపాటి రాజా పరామర్శించారు.

సీఎం జగన్‌కు ఓటమి భయం పట్టుకుంది.. అందుకే అరాచకాలు
New Update

వెనక్కి తగ్గేది లేదు.. 

వినుకొండలో అల్లర్లు సృష్టించడానికి పథకం పన్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్ర చేశారన్నారు. ఎమ్మెల్యే బొల్లా మొదటి నుంచి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజాబలం కోల్పోయిన ఎమ్మెల్యే బొల్లా దౌర్జన్యాలకు దిగారని తెలిపారు. అవసరం లేకపోయినా ఫైరింగ్ చేసిన సిఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నరసరావుపేటలో కూడా టీడీపీ నేతలపై దాడులు చేసి తిరిగి వాళ్లపైనే కేసులు పెట్టారన్నారు. వినుకొండలో కూడా టీడీపీ వాళ్లపైనే తప్పుడు కేసులు పెట్టారన్నారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా... దాడులు చేసినా వెనక్కి తగ్గేది లేదని వెల్లడించారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వినుకొండ బాధితులను టీడీపీ నేతలు జీవీ ఆంజనేయులు, ఆలపాటి రాజా, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, జూలకంటి బ్రహ్మరెడ్డి పరామర్శించారు.

పథకం ప్రకారమే దాడులు.. 

రాష్ట్రంలో రోజురోజుకు అల్లర్లు పెరుగుతున్నాయని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే రాష్ట్రంలో అలజడులు సృష్టించే కుట్రలు చేస్తున్నారన్నారు. వినుకొండలో పథకం ప్రకారం దాడులు చేశారన్నారు. మొన్న నరసరావుపేటలో ఎమ్మెల్యే దగ్గరుండి దాడులు చేయిస్తే.. తాజాగా వినుకొండ ఎమ్మెల్యే స్వయంగా రోడ్డుపై ఉండి దాడులు చేయించడం దారుణమని తెలిపారు. భవిష్యత్తులో ఎవ్వరిని వదిలిపెట్టమని.. అందరి లెక్కలు తేలుస్తామని కొల్లు హెచ్చరించారు. పాలన చేతగాని సీఎం జగన్ అరాచకాలు చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శలు చేశారు. ఎమ్మెల్యేలను వీధిరౌడీలుగా చేశారని.. స్వయంగా ఎమ్యెల్యేల సమక్షంలోనే దాడులు జరుగుతున్నాయన్నారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన వారే అల్లర్లు సృష్టించడం బాధాకరమన్నారు. పోలీసులు, వైసీపీ నేతలు కలిసి వచ్చినా ప్రజల వెంట్రుక కూడా పీకలేరని వార్నింగ్ ఇచ్చారు.

సీఐని సస్పెండ్ చేయాలి.. 

ఏపిలో జగన్ రెడ్డి చివరిగా అరాచక ఆస్త్రం ప్రయోగిస్తున్నారని.. అవినీతిని ప్రశ్నిస్తే తట్టుకోలేక దాడులు చేస్తున్నారని మాచర్ల టీడీపీ నేత జూలకంటి విమర్శించారు. పల్నాడు జిల్లాలో లోకేష్ యవగళం పాదయాత్రను అడ్డుకోవాలని కుట్రచేస్తున్నారని ఆరోపించారు. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నట్లు, బోల్డులు లూజ్ అయ్యాయని.. వచ్చే ఎన్నికలలో పీకేయడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని హెచ్చరించారు. వినుకొండలో ఉద్దేశ్యపూర్వకంగానే టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయని.. తాడేపల్లి ఆదేశాలతోనే వినుకొండలో వైసీపీ దాడులకు దిగిందని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపణలు చేశారు. పల్నాడులో యవగళం పాదయాత్రకు అడ్డంకులు సృష్టించే కుట్ర చేశారన్నారు. స్వయంగా పోలీసులే కర్రలు ఇచ్చి దాడులకు సహకరించారని ఆరోపించారు. అవసరం లేకుండా ఫైరింగ్ చేసిన సిఐను సస్పెండ్ చేయాలన్నారు. మాచర్ల వైసీపీ నేతలు వినుకొండలో హల్‌చల్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఇక నుంచి ఎమ్మెల్యే బొల్లా బట్టలూ దీసి రోడ్డుపై నిలబెడతామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe