TTD: ధర్మారెడ్డి, భూమనకు షాక్.. టీటీడీలో అక్రమాలపై సీఐడీ?

శ్రీవారి టిక్కెట్ల విక్రయం, వీఐపీ దర్శనాల్లో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ నేతలు సీఎస్ కు ఫిర్యాదు చేశారు. వైసీపీకి మేలు చేసేలా వీరు చేసిన అవకతవకలపై సీఐడి లేదా విజిలెన్స్‌ తో విచారణ జరిపించాలని కోరారు.

TTD: ధర్మారెడ్డి, భూమనకు షాక్.. టీటీడీలో అక్రమాలపై సీఐడీ?
New Update

టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి ఉచ్చు బిగుసుకుంటోంది. టీడీపీలో వైసీపీకి లబ్ధి చేసేలా వీరు వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయమై టీటీడీ ఈ రోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసింది. నాడు అధికారంలో ఉన్న వైసీపీకి లబ్దీ చేకూర్చేందుకు ధర్మారెడ్డి, భూమన అక్రమాలకు పాల్పడ్డారని సీఎస్ కు ఫిర్యాదు చేశారు. ఇందుకోసం సంప్రదాయాలకు విరుద్ధంగా నడుచుకున్నారని పేర్కొన్నారు. ఈ ఇద్దరిపై సీఐడి లేదా విజిలెన్స్‌ తో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

సీఎస్‌కు ఇచ్చిన లేఖలో పలు అంశాలను టీడీపీ నేతలు ప్రస్తావించారు. శ్రీవారి టిక్కెట్ల విక్రయం, వీఐపీ దర్శనాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇంకా.. రూ.2 కోట్ల విలువ గల డైమెండ్‌ వాచ్‌ను హైకోర్టు జడ్జికి ఆఫర్ చేశారనే వదంతులు కూడా ఉన్నాయని ప్రస్తావించారు. ఇంకా ఎన్నికల్లో భూమన అభినయ్‌ రెడ్డికి లబ్ది చేకూర్చేందుకు టీటీడీలో ధర్మారెడ్డి, కరుణాకర్‌ రెడ్డి అక్రమాలు చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు.

తిరుమలలో గెస్ట్‌హౌస్‌ నిర్మాణాల్లోనూ అక్రమాలు చేశారని వివరించారు. టీడీపీ నేతల ఫిర్యాదుతో ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే అంశం చర్చనీయాంశమైంది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి