బీసీ జనగణన అని మభ్యపెట్టాలని చూస్తున్నారు.!

బడుగు బలహీన వర్గాలను వైసీపీ అణగదొక్కుతుందన్నారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. 34% ఉన్న బీసీలకి వైసీపీ 24% రాజకీయ రిజర్వేషన్ తగ్గించిందని..మళ్లీ ఇప్పుడు బీసీ జనగణన అని మభ్యపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు.

New Update
Kollu Ravindra: కలెక్టరేట్ లో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష.. పెండింగ్ పనులపై అరా..!

TDP: రాష్టంలో నాలుగున్నర ఏళ్లుగా బడుగు బలహీన వర్గాలను వైసీపీ అణగదొక్కుతుందన్నారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. 34%ఉన్న బీసీలకి వైసీపీ 24%రాజకీయ రిజర్వేషన్ తగ్గించిందని అన్నారు. తన మీద హత్య కేసు పెట్టి  జైల్ లో పెట్టారని..ఇంకా కొత్త కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఎన్ని కేసులు పెట్టిన బీసీ నాయకులు భయపడరని ధీమ వ్యక్తం చేశారు.

బీసీలకి రాజకీయ రిజర్వేషన్ చేసిన గొప్ప వ్యక్తి అన్న ఎన్టీఆర్ అని కీర్తించారు. సామాజిక బస్సు యాత్ర చేసే అర్హత వైసీపీకి లేదని విమర్శించారు. వైసీపీ నాయకులు బస్సులు ఎక్కి ఊరేగుతున్నారని ఎద్దెవ చేశారు. ఈ క్రమంలోనే బీసీల మీద దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ జనగణన అని మరోసారి మభ్యపెట్టాలని చూస్తున్నారని వ్యాఖ్యనించారు. అయితే, టీడీపీ అధికారంలోకి వచ్చాక చట్టభద్ధంగా బీసీ జనగణన చేస్తామని తెలిపారు. రాష్ట్రస్థాయి సమావేశాలు పెట్టి బీసీలకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.టీడీపీ,జనసేన కలిసి బీసీలకి న్యాయం చేస్తామని భరోసా కల్పించారు.

Also Read: కేసీఆర్, కేటీఆర్ కాళ్ల బేరానికి వచ్చారు..కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు.!

టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు మాట్లాడుతూ..జగన్ సీఎం అయ్యాక బలహీన వర్గాల మీద దామనకాండ జరుగుతుందని మండిపడ్డారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే దాడులు, అరెస్ట్ లు, కేసులు నమోదు చేస్తున్నారని దుయ్యబట్టారు. కుంభ కర్ణుడు నిద్ర లేచినట్టుగా..ఇప్పుడు సీఎం సామాజిక యాత్రలు అంటూ తిరుగుతున్నారని కౌంటర్ వేశారు. పేరుకే బీసీలకి పదవులు,. పెత్తనం అంత రెడ్డిదే జరుగుతుందని కామెంట్స్ చేశారు.  కార్పొరేషన్స్ పెట్టారు కానీ నిధులు ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. బీసీ విద్యార్థులకి ఈ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు.

జగన్ ఒక దుర్మార్గుడుగా తయ్యారు అయ్యాడని దుయ్యబట్టారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడని.. అమరావతిని నాశనం చేసాడని ఫైర్ అయ్యరు. వైసీపీ చేసే కులగణన చిత్తూ కాగితానికి కూడా పనికి రాదని..కుల గణన చట్టబద్దంగా కేంద్ర ప్రభుత్వం చేయాలని వ్యాఖ్యనించారు.

Advertisment
తాజా కథనాలు