/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/tdp-1-3-jpg.webp)
TDP: ఆంధ్రప్రదేశ్ లో గాడి తప్పిన పాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ కేంద్ర మానవ హక్కుల కమిషన్ కు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసినట్టు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆడారి కిషోర్ కుమార్ తెలిపారు. బుధవారం ఉదయం ఢిల్లీ లోని హ్యూమన్ రైట్స్ కమిషన్ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ ఏపీలో జరుగుతున్న అరాచకాలను జాతీయ పార్టీల నేతల దృష్టికి తీసుకు వెళ్లేందుకు గత ఆరు రోజులుగా దేశ రాజధాని హస్తినలో ప్రత్యక్ష నిరసనలు చేస్తున్నట్టు తెలిపారు.
ఇప్పడికే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, భారత ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కార్యాలయాల్లో నేరుగా ఫిర్యాదు చేసినట్టు ఆడారి కిషోర్ కుమార్ తెలిపారు. రాజ్ ఘాట్ వద్ద సమస్యను గాంధీ కి విన్నవిస్తు ఘన నివాళి అర్పించినట్టు తెలిపారు. రాష్ట్ర పరిస్థితులపై దృష్టి పెట్టి సమస్యలను చక్కదిద్దాలని విన్నవించామన్నారు. ఈ పర్యటనలో ఇప్పడికే ఏపీ భవన్ వద్ద, జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన కూడా చేయడం జరిగిందన్నారు. పార్లమెంట్ వద్ద నేషనల్ మీడియా పాయింట్ వేదిక గా జాతీయ మీడియాలతో మాట్లాడామని తెలిపారు.
వైసీపీ అధికారం చేపట్టిన రోజు నుంచి ఏ ఒక్కరోజు కూడా రాజ్యాంగ బద్దంగా వ్యవహరించలేదన్నారు. చట్టాలను తమ చట్టంగా చేసుకుని అత్యంత భయంకరమైన క్రూర చర్యలకు దిగబడ్డారన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల అధినేతలు నుంచి సామాన్య కార్యకర్తల వరకూ ప్రతిరోజూ ప్రత్యక్ష నరకం అనుభవిస్తూన్నారన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు.రాజ్యాంగానికి లోబడి పని చెయ్యవలసిన అధికారులు రూల్స్ ను ఏనాడో తుంగలోకి తొక్కారన్నారు.
ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడును అత్యంత పాశవికంగా అర్ధరాత్రి అరెస్ట్ చెయ్యడం పై మండిపడ్డారు. ఏమాత్రం పసలేని, సంబంధం లేని, ఆధారం లేని స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ స్కీంలో చంద్ర బాబునూ అరెస్ట్ చెయ్యడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. ఈయన దార్శనికత ఆధారంగా సుమారు 5 లక్షల మంది స్కిల్స్ లో శిక్షణ తీసుకుని దేశ విదేశాల్లో పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. సాక్షాత్తు అభియోగం మోపబడిన సిమెన్స్ సంస్థ అధిపతులే ఈ స్కీం లో ఎటువంటి స్కాం జరగలేదని చెప్పినా మొండి పట్టుదలతో అధికార పార్టీ వెళ్తోందన్నారు. వీళ్ళ మూర్ఖపు ధోరణి వల్ల ప్రజలు నష్టపోతున్నారని మండిపడ్డారు. బాబు పై జరిగిన కుట్రను ఖండిస్తూ పార్టీలకతీతంగా ముందుకు రావాలని ఢిల్లీ నుండి పిలుపునిస్తున్నామన్నారు. ఈ పర్యటనలో నేషనల్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ దళిత జే ఏ సీ అధ్యక్షులు ఆలూరి రాజేష్, ఢిల్లీ తెలుగు సంఘాల ప్రతినిధులు, పాల్గొన్నారు.
Also Read: చంద్రబాబునే అరెస్ట్ చేస్తే మాలాంటి సామాన్యుడి పరిస్థితి ఏంటి..?