Ananthapur: అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి టీడీపీ నేత గొల్ల ఆదెప్ప (50) దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన రైతులు తమ వ్యవసాయ పొలాల్లోకి వెళుతుండగా ప్రధాన రహదారిలో పడి ఉన్న అతని మృతుడేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
Also Read: తాడేపల్లిగూడెంలో జి.ఆర్.రెడ్డి కంటి హాస్పిటల్ వైద్యుల దోపిడి.. HIV పాజిటివ్ అని చెప్పి..
పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న గొల్ల ఆదెప్ప ను వైసీపీకి చెందిన ప్రత్యర్థులు వేట కొడవళ్ళు, కత్తులతో పొడిచి దారుణ హత్య చేసి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాత కక్షలే హత్యకు గల కారణాలుగా గ్రామస్తులు పేర్కొన్నారు. హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వచ్చి హత్య ప్రదేశంలోని అనువాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు గతంలో మెచ్చిరి గ్రామ ఉపసర్పంచిగా పనిచేశాడు.
Also Read: ఏపీకి పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ.. చంద్రబాబుతో బీపీసీల్ ప్రతినిధుల భేటీ..!
కాగా, గ్రామంలో గత ఏడాది ప్రధానంగా టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఆ గొడవల్లో పలువురుకి తీవ్ర గాయాలై ఆసుపత్రి పాలయ్యారు. అప్పట్లో పోలీసులు తెలుగుదేశం పార్టీకి చెందిన 16 మందిపై కేసులు నమోదు చేశారు. వైసీపీ వర్గీయులపై నామమాత్రంగానే కేసులు నమోదు చేశారు.