/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Nara-Lokesh-Kilari-Rajesh-jpg.webp)
ఎట్టకేలకు నారా లోకేష్ (Nara Lokesh) పీఏ కిలారు రాజేశ్ అజ్ఞాతం వీడారు. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో జరుగుతున్న విచారణకు ఆయన హాజరయ్యారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో, స్కిల్ స్కామ్ లో కిలారు రాజేష్ పాత్ర పై సీఐడీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబునాయుడు అరెస్ట్ అయిన నాటి నుంచి కిలారు రాజేష్ అజ్ఞతంలోకి వెళ్లడం చర్చనీయాంశమైంది. రెండు రోజుల క్రితం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాo కేసుకు సంబంధించి సీఐడీ అధికారులు ఆయనకు 41ఏ నోటీసులు అందించారు. ఈ నేపథ్యంలో రాజేశ్ ఈ రోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు.
ఈ స్టోరీ అప్డేట్ అవుతోంది..