టీడీపీ నేత, నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని (Nandamuri Suhasini) కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సుహసినితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ, మంత్రి కొండా సురేఖ సీఎంతో భేటీ అయ్యారు. ప్రస్తుతం టీటీడీపీ ఉపాధ్యక్షురాలిగా సుహాసిని ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో 70 వేలకు పైగా ఓట్లను ఆమె సాధించారు. అప్పటి నుంచి సుహాసిని రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు రేవంత్‌ను సుహాసిని కలవడంపై కాంగ్రెస్‌లో చేరుతున్నారని ప్రచారం సాగుతోంది.
Nandamuri Suhasini: రేవంత్ రెడ్డితో నందమూరి సుహాసిని భేటీ.. త్వరలో కాంగ్రెస్లోకి?
నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఈ రోజు రేవంత్ రెడ్డితో ఆమె భేటీ అయ్యారు. ఈ భేటీలో సుహాసినితో పాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు.
New Update
Advertisment