సజ్జలను వెంటనే అరెస్ట్ చేయాలి: పోలీసులకు దేవినేని ఉమా ఫిర్యాదు నిబంధనలు పాటించేవాళ్లు కౌంటింగ్ కు వెళ్లవద్దు.. అడ్డుకునే వాళ్ళు అడ్డం చెప్పే వాళ్లే వెళ్ళండని వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించాడని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. సజ్జలను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ తాడేపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. By Nikhil 30 May 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి చాలా బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశారని టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫైర్ అయ్యారు. వైసీపీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇస్తూ నియమ నిబంధనలు పాటించేవాళ్లు కౌంటింగ్ కు వెళ్లవద్దు.. అడ్డుకునే వాళ్ళు అడ్డం చెప్పే వాళ్లే వెళ్ళండి అంటున్నాడని ఆరోపించారు. ఒక కుట్రదారుడిగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అడ్డం పడడానికి ఓడిపోతామనే భయంతో ఈ కుట్రలకు కుతంత్రాలకు తెరలేపాడని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి అండదండలు, ప్రోత్సాహంతోనే ఇవన్నీ జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. దీనిని ఖండిస్తూ అడ్వకేట్ గూడపాటి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈరోజు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సజ్జల రామకృష్ణారెడ్డి పై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. తద్వారా కౌంటింగ్ ప్రక్రియకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడాలన్నారు. ఎన్నికల సంఘం కూడా దీనిపై తగు ఆదేశాలు ఇచ్చి వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. Your browser does not support the video tag. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి