AP: ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం చంద్రబాబు ఇలా ఆదేశించారు: దాడి రత్నాకర్ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నడుంబిగించారన్నారు టీడీపీ నేత దాడి రత్నాకర్. అనకాపల్లి జిల్లాలో మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించేందుకు సర్వే నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారన్నారు. పలు అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ చేయాలని ఆదేశించారని తెలిపారు. By Jyoshna Sappogula 12 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Vishaka: ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు నడుంబిగించారని టీడీపీ నాయకుడు దాడి రత్నాకర్ అన్నారు. అనకాపల్లి జిల్లాలో మాడుగుల చోడవరం ప్రాంతాలలో ఐదు నుంచి పది ఎకరాల వరకు యస్ ఇ జడ్ నిర్మాణానికి భూసేకరణ చేయాలని చంద్రబాబు ఆదేశించారని అన్నారు. Also Read: కాన్వాయ్ ఆపి ప్రజల సమస్యలు తెలుసుకున్న చంద్రబాబు..! అదేవిధంగా నక్కపల్లి పరిసర ప్రాంతాల్లో ఫార్మ పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూసేకరణకు అధికారులు ఆదేశించారని తెలిపారు. అనకాపల్లి జిల్లాలో మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించేందుకు సర్వే నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారని, ఫ్యాక్టరీలు సామర్థ్యానికి సరిపడా చెరుకు ఉత్పత్తి ఉందో లేదో తెలపాలన్నారు. లేని యెడల విత్తనాలు ఉత్పత్తికి అనుగుణంగా నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారని తెలిపారు. Also Read: ఈ రాష్ట్రంలో అన్ని బీజేపీ పార్టీలే.. అందుకే జగన్ ఇలా చేశాడు: షర్మిల యువత గంజాయి బారిన పడకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. మహిళల పట్ల ఎవరైనా అనుచితంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారని అన్నారు. #vishaka మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి