AP: కాన్వాయ్ ఆపి ప్రజల సమస్యలు తెలుసుకున్న చంద్రబాబు..!

సీఎం చంద్రబాబు కాన్వాయ్ ఆపి సామాన్య ప్రజలను కలిశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సచివాలయానికి వెళుతున్న సమయంలో కరకట్టపై ఉన్న ప్రజలను చూసి తన కాన్వాయ్ ను ఆపారు. ప్రజల సమ్యసలు తెలుసుకుని పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారు.

New Update
AP: కాన్వాయ్ ఆపి ప్రజల సమస్యలు తెలుసుకున్న చంద్రబాబు..!

CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఆపి సామాన్య ప్రజలను కలిశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సచివాలయానికి వెళుతున్న సమయంలో కరకట్టపై ఉన్న ప్రజలను చూసి తన కాన్వాయ్ ను ఆపారు. సమస్యలపై వినతులు అందించేందుకు వచ్చిన ప్రజలను పిలిచి మాట్లాడారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పలువురు తమ సమస్యలు చెప్పుకున్నారు. అనంతరం వారి నుండి వినతిపత్రాలు తీసుకున్నారు. సమస్యలను పరిష్కరిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా కారుదిగి వచ్చి హామీ ఇవ్వడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు