Chandrababu: ఎమ్మెల్సీ మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం.! పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. అంగన్వాడీల పోరాటానికి మద్దతు తెలిపి అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోవడం విచారకరమన్నారు. తన చివరి ఘడియల్లో సైతం ప్రజాసేవలోనే గడిపారని ఆవేదన వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 15 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Chandrababu Naidu: ఏపీలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు. ఏలూరు నుంచి భీమవరం వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన మృతిపై రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తాజాగా, టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతిపై సోషల్ మీడియాలో స్పందించారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత విషాదకరం. అంగన్వాడీల పోరాటానికి మద్దతు తెలిపి అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోవడం విచారకరం. తన చివరి ఘడియల్లో సైతం ప్రజాసేవలోనే గడిపిన షేక్ సాబ్జీ మృతికి తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ… pic.twitter.com/dnJq7a0o1g — N Chandrababu Naidu (@ncbn) December 15, 2023 పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత విషాదకరం అన్నారు. అంగన్వాడీల పోరాటానికి మద్దతు తెలిపి అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోవడం విచారకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. తన చివరి ఘడియల్లో సైతం ప్రజాసేవలోనే గడిపిన షేక్ సాబ్జీ మృతికి తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ మృతి పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం ట్విట్టర్ లో స్పందించారు. "రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ గారు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. శాసనమండలిలో వినిపించే ప్రజల గొంతు మూగబోయింది. ఉపాధ్యాయుల హక్కుల పోరాటయోధుడు షేక్ సాబ్జీ గారికి నివాళులర్పిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను" అని పోస్ట్ చేశారు. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ గారు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. శాసనమండలిలో వినిపించే ప్రజల గొంతు మూగబోయింది. ఉపాధ్యాయుల హక్కుల పోరాటయోధుడు షేక్ సాబ్జీ గారికి నివాళులర్పిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. pic.twitter.com/7KxULqiLlD — Lokesh Nara (@naralokesh) December 15, 2023 #andhra-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి