TDP Leader Bonda Uma: బోండా ఉమా సెంట్రల్ కార్యాలయం ముందు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నార్తు. సీఎం జగన్పై జరిగిన దాడి కేసులో బోండా ఉమాను అరెస్ట్ చేస్తారనే అనుమానంతో అభిమానులు ఉమా కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే బోండా ఉమాను అదుపులోకి తీసుకునేందుకు షాడో టీమ్స్ ఆయన కార్యాలయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. సీఎం పై దాడి కేసులో బోండా ఉమా పాత్ర పై వైసీపీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: యాక్సిడెంట్ కేసులో నటుడు రఘుబాబుకు బెయిల్
ఆ బాలుడుతో కావాలనే సీఎం జగన్ పై టీడీపీ నేత బోండా ఉమా దాడికి చేయించారని ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ మాత్రం ఎన్నికల ముందు వైసీపీ ఆడుతున్న డ్రామా ఇది అని.. కావాలనే బోండా ఉమాను ఈ కేసులో ఇరికించాలని వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విమర్శలు చేస్తోంది. సీఎం జగన్ పై జరిగిన దాడి కేసులో ఏ1 గా ఉన్న సతీష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కోర్టు నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించింది.