Bonda Uma: చంద్రబాబుకు ఐటీ నోటీసుల వెనుక సీఎం జగన్ హస్తం.. బోండా ఉమ ఆరోపణలు ఎన్నికల వేళ ఏపీలో రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసుల వార్తల నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. By BalaMurali Krishna 06 Sep 2023 in గుంటూరు రాజకీయాలు New Update షేర్ చేయండి ఢిల్లీ స్థాయిలో జగన్ లాబీయింగ్ చేయించారు.. ఎన్నికల వేళ ఏపీలో రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసుల వార్తల నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ నేతలు చంద్రబాబుపై మూకుమ్మడి దాడి చేస్తున్నారు. దీంతో టీడీపీ నేతలు కూడా కౌంటర్ అటాక్‌కు దిగారు. చంద్రబాబుకు వచ్చిన ఐటీ నోటీసుల వెనుక సీఎం జగన్ రెడ్డి హస్తం ఉందని టీడీపీ నేత బోండా ఉమ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ స్థాయిలో జగన్ లాబీయింగ్ చేసి, చంద్రబాబుకు తప్పుడు నోటీసులు ఇప్పించారని ఆరోపించారు. నోటీసులు ఇప్పించినంత మాత్రాన చంద్రబాబు అవినీతిపరుడు కాదని.. వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తేనో తప్పు చేసినట్టుకాదని స్పష్టంచేశారు. ఆరోపణలను నిరూపించే దమ్ము ఉందా..? చంద్రబాబు తనకు వచ్చిన నోటీసులపై ఇప్పటికే సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన సమాధానాలకు ఐటీ శాఖ సంతృప్తి చెందింనట్లు తెలిపారు. లేనిది ఉన్నట్టు విషప్రచారం చేసి ప్రజల్ని నమ్మించడం జగన్ రెడ్డికి, అతని కుటుంబానికి బాగా అలవాటేనని విమర్శించారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా చంద్రబాబు పైన అవినీతి ఆరోపణలు చేశారని, కానీ ఏం నిరూపించలేకపోయిన విషయాన్ని బోండా గుర్తు చేశారు. జగన్ తల్లి విజయమ్మ కూడా కోర్టుల్లో కేసులు వేసి, ఆధారాలు చూపలేక వాటిని వెనక్కు తీసుకున్నారని ఆయన వివరించారు. ఇప్పుడు కూడా చంద్రబాబుపై చేస్తున్న అవినీతి ఆరోపణలను నిరూపించే దమ్ము వైసీపీ నేతలకు ఉందా అని సవాల్ విసిరారు. దేశంలో చంద్రబాబు ఒక్కరే.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు రూ. 6లక్షల కోట్ల అవినీతి చేశారని పుస్తకాలు ముద్రించిన జగన్ రెడ్డి ఈ నాలుగేళ్లలో ఏం నిరూపించారని ప్రశ్నించారు. అవినీతి సామ్రాట్ జగన్ రెడ్డి నీతిమాలిన చరిత్ర బ్లూమీడియా, వైసీపీ నేతలకు తప్ప దేశమంతా తెలుసని ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి మరక లేని ఏకైక నాయకుడు దేశంలో చంద్రబాబు ఒక్కరేనని వెల్లడించారు. పథకం ప్రకారమే పాదయాత్రపై దాడులు.. అలాగే లోకేష్ యువగళం పాదయాత్రపై వైసీపీ కార్యకర్తలు పథకం ప్రకారం దాడులు చేస్తున్నారని ఉమ ఆరోపించారు. యువగళం పాదయాత్రతో వైసీపీ వెన్నులో వణుకు పుడుతోందని అందుకే దాడులకు తెగబడ్డారని ఉమ మండిపడ్డారు. పాదయాత్రపై రాళ్ల దాడి చేసి మళ్లీ యువగళం వాలంటీర్ల పైనే అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. లోకేష్ పాదయాత్రకు తగిన రక్షణ కల్పించాలని డీజీపీకి ఎన్ని లేఖలు రాసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తే ఎంతవరకైనా వెళ్తామని బోండా వార్నింగ్ ఇచ్చారు. ఇది కూడా చదవండి: నన్ను అరెస్ట్ చేస్తారు: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి