Atchannaidu: చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నేతలు గవర్నర్‌ను కలిశారు. అచ్చెన్నాయుడు నేతృత్వంలో విశాఖ పోర్ట్ గెస్ట్ హౌస్‌కు గంటా శ్రీనివాసరావు, రామారావు, రాజబాబు, గండి బాబ్జి, చిరంజీవిరావు తదితరులు అక్కడ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు.

New Update
Atchannaidu: చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు

TDP leaders submit letter to AP Governor: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు (Chandrababu Arrest) పై టీడీపీ నేతలు గవర్నర్‌ను కలిశారు. అచ్చెన్నాయుడు నేతృత్వంలో విశాఖ పోర్ట్ గెస్ట్ హౌస్‌కు గంటా శ్రీనివాసరావు, రామారావు, రాజబాబు, గండి బాబ్జి, చిరంజీవిరావు తదితరులు అక్కడ గవర్నర్ అబ్దుల్ నజీర్‌(Abdul Nazeer)ను కలిశారు. ఆదివారం ( సెప్టెబర్‌ 10) ఉదయమే గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ను రద్దు చేశారు. దీంతో మరోసారి నిన్న సాయంత్రం టీడీపీ నేతలు గవర్నర్ అపాయింట్‌మెంట్‌ కోరటంతో.. సోమవారం ఉదయం అపాయింట్‌మెంట్ ఇచ్చారు...

గవర్నర్‌కు ఫిర్యాదు

గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ను కలిసి బయటకు వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు (Atchannaidu)  ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందస్తు సమాచారం ఇవ్వకూడానే చంద్రబాబు అరెస్టుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారన్నారు. అంతేకాదు చంద్రబాబు విషయంలో రాష్ట్రంలో పరిణామాలను గమనిస్తున్నట్లు వివరించామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఏపీలో రోజురోజూకు టీడీపీకి పెరుగుతున్న ప్రజాదరణ పెరుగుతోంది. వైసీపీ ఓర్వలేక చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. రాష్ట్రంలో యువనేత లోకేశ్ పాదయాత్రను ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. ఆది చూసి వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని వైసీపీ నేతలకు భాగా అర్థమైందన్నారు. సైకో, ఓ శాడిస్ట్, కూడా ఇలాంటి దుర్మార్గపు అరెస్టుకు ఆదేశించరని మండిపడ్డారు.వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తాం. దీంతో వైసీపీ చిరునామా గల్లంతేనని తేలిందని అందుకే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని అచ్చెన్నాయుడు విమర్శించారు.

Also Read: చంద్రబాబుకు మరో షాక్.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పిటిషన్

జగన్ సర్కార్ అవినీతిపై

జగన్ (CM Jagan) సైకోలాగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబును ఒక్కరోజైనా జైల్లో పెట్టాలని జగన్ కంకణం కట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి (YCP) నాలుగున్నర సంవత్సరాలుగా చంద్రబాబుపై అవినీతి కనపడ లేదా? అని ప్రశ్నించారు. జగన్ సర్కార్ అవినీతిపై చంద్రబాబు నిత్యం ప్రశ్నిస్తున్నారని. అందుకే కక్షకట్టారని ఆరోపించారు. మద్యపానం పేరుతో జగన్ కోట్ల రూపాయాలు దోచుకుంటుకున్నారన్నారు. తమ నాయుకుడు మనో ధైర్యాన్ని దెబ్బతీయలేరు. టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకున్నామని వెల్లడించారు.

కోర్టులను మేనేజ్ చేసే శక్తి లేదు..

అధికార యంత్రంగాన్ని ఈ కేసులో ఎందుకు భాగస్వామ్యం చేయలేదు. కోర్టులను మేనేజ్ చేసే శక్తి మాకు లేదని.. ఎమర్జెన్సీ రోజులు ఏపీలో కనిపిస్తున్నాయి. చంద్రబాబు హౌస్ అరస్ట్‌కు అవకాశం ఇవ్వండి అన్నారు. ఈ ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదన్నారు. చంద్రబాబుని జైల్లో ఏమి చేస్తారనో ఆందోళన కలుగుతోందన్నారు. తాము చేస్తున్న పోరాటానికి ప్రజలు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సజ్జల రామకృష్ణరెడ్డి మదమెక్కి మాట్లాడుతున్నారని.. ప్రజలే సమాధానం చెబుతారని.. ఆరోజు దగ్గరలోనే ఉందన్నారు. చంద్రబాబు అరెస్ట్ కోసం ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.

Also Read: రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఒంటరిగానే చంద్రబాబు.. కలవని కుటుంబసభ్యులు!

Advertisment
తాజా కథనాలు